నీటి అడుగున డేటా సెంటర్లు.. వేగవంతమైన ఇంటర్నెట్‌కు హామీనిస్తున్న ప్రాజెక్ట్

by sudharani |   ( Updated:2022-09-05 07:43:09.0  )
నీటి అడుగున డేటా సెంటర్లు.. వేగవంతమైన ఇంటర్నెట్‌కు హామీనిస్తున్న ప్రాజెక్ట్
X

దిశ, ఫీచర్స్ : మొట్టమొదటి US కమర్షియల్ సబ్‌సీ డేటా సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి పసిఫిక్ మహాసముద్ర గర్భంలో అడుగుపెట్టనుంది. యూఎస్ వాయువ్య తీరప్రాంతంలోని పోర్ట్ ఏంజెల్స్ సమీపాన 'జూల్స్ వెర్న్ పాడ్' ఇన్‌స్టాలేషన్ కోసం షెడ్యూల్ చేయబడింది. ఇది సర్వర్ల నిర్వహణను విప్లవాత్మకంగా మార్చవచ్చు. 6 మీటర్ల షిప్పింగ్ కంటైనర్‌ను పోలిఉండే ఈ పాడ్.. 800 సర్వర్స్‌తో నీటి అడుగున 9 మీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. కార్బన్ ఉద్గారాలను 40 శాతం తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ ఉద్దేశించబడింది.

ఈ మేరకు శక్తి ఉత్పత్తి, నిర్మాణ పద్ధతులు, మెటీరియల్స్ సహా సస్టెయినబిలిటీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని పాడ్స్ మేకింగ్ కంపెనీ 'సబ్‌సీ క్లౌడ్' వ్యవస్థాపకుడు మాక్సీ రెనాల్డ్స్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో తమ మొదటి 10 పాడ్స్‌తో విద్యుత్ శీతలీకరణ అవసరాన్ని తగ్గించడం ద్వారా సమానమైన భూ-ఆధారిత కేంద్రంతో పోల్చితే 7,683 టన్నులకు పైగా CO2ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సబ్‌సీ క్లౌడ్ తెలిపింది. ఈ డేటా సెంటర్లు USలోని హెల్త్‌కేర్, ఫైనాన్స్ అండ్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుంటాయని వెల్లడించింది.

సబ్‌సీ డేటా సెంటర్లు అంటే ఏమిటి?

భాగస్వామ్య ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(IT) కార్యకలాపాలను కేంద్రీకరించడానికి ఈ డేటా కేంద్రాలు ఉపయోగించబడతాయి. ఇవి మన దైనందిన జీవితాల నిర్వహణకు చాలా అవసరం. ఇప్పటికే క్లౌడ్, గూగుల్, మెటా వంటివన్నీ తమ ఉత్పత్తులను అమలు చేయడానికి ఉపయోగించే డేటా కేంద్రాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భూమిపై నిర్మించబడిన ఈ డేటా కేంద్రాలు కొన్నిచోట్ల భారీ జనాభా గల ప్రాంతాలకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేయబడ్డాయి. సబ్‌సీ ద్వారా నిర్మితమవుతున్న మునుపటి ప్రభుత్వ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ 'జూల్స్ వెర్న్ పాడ్' నిర్మించనున్నారు. ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో Njord01 పాడ్, ఉత్తర సముద్రంలో మనన్నాన్ పాడ్‌ చేపట్టనున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పాడ్ లోతు దాదాపు 250 మీటర్లు ఉండనుండగా.. ఉత్తర సముద్రపు లోతు 200 మీ. ఇదిలా ఉంటే.. హైనాన్ ద్వీపంలోని సముద్రతీర నగరం సన్యాలో చైనా కంపెనీ హైలాండర్.. సముద్రగర్భ డేటా కేంద్రాన్ని కూడా ప్లాన్ చేసింది.

నీటి అడుగున డేటా కేంద్రాలు : ఖర్చు తక్కువ, నమ్మదగినవి?

భూ-ఆధారిత కార్యకలాపాలతో పోల్చితే సముద్రగర్భ డేటా కేంద్రాల తయారీకి 90 శాతం తక్కువ ఖర్చవుతుందని సబ్‌సీ తెలిపింది. మెట్రోపాలిటన్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన సంక్లిష్టమైనది, ఖరీదైనది. భూమి హక్కులు, రియల్ పర్మిట్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. పని నెమ్మదిగా జరగడమే కాక ఖరీదైనది కావచ్చు. ఉదా : ఒక సబ్‌సీ కేబుల్‌ను ఇన్‌స్టాల్ చేయడం, పాతిపెట్టడానికి దాదాపు 18 నిమిషాలు పడుతుంది. ప్రతి మైలు(1.6 కిమీ) కేబుల్‌కు దాదాపు €1,700 ఖర్చవుతుందని రేనాల్డ్స్ చెప్పారు. అదే భూమిపై దీనికి దాదాపు 14 రోజులు పడుతుంది. అంటే మైలుకు €165,000 ఖర్చవుతుంది.

వేగవంతమైన కనెక్షన్

ఖర్చులు, పర్యావరణ పాదముద్రను తగ్గించడంతోపాటు ఈ నీటి అడుగున డేటా కేంద్రాలు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను కూడా అందించగలవు. సబ్‌సీ కంపెనీ తన అండర్ వాటర్ పాడ్స్‌ ద్వారా జాప్యం- లేదా డేటా లాగ్‌ను 98 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొంది. 'లేటెన్సీ అనేది దూరం యొక్క ఉపఉత్పత్తి. కాబట్టి ఈ డేటా సెంటర్లు మెట్రోపాలిటన్ ప్రాంతాల నుంచి ఎంత దూరంగా ఉంటాయో అంత ఎక్కువ పరిచయం చేయబడుతుంది' అని రెనాల్డ్స్ చెప్పారు.

ప్రపంచ జనాభాలో 40 శాతం మంది ప్రజలు తీరానికి 100 కి.మీ లోపల నివసిస్తున్నారు. లాస్ ఏంజెల్స్, షాంఘై, ఇస్తాంబుల్ వంటి ప్రధాన పట్టణ తీర కేంద్రాల్లో సబ్‌సీ డేటా సెంటర్‌లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ప్రజలు తమ పరికరాలను ఉపయోగించడం మెరుగుపడుతుంది. సిగ్నల్స్ 200కిమీ/మిల్లీసెకన్ల వేగంతో ప్రయాణిస్తాయి. సగటు డేటా సెంటర్ ఇంటర్నెట్ వినియోగదారు నుంచి 400 కిమీ దూరంలో ఉంటుంది. అంటే రౌండ్ ట్రిప్‌కు 40 మిల్లీసెకన్లు పడుతుంది. దూరం తగ్గినందున సబ్‌సీ పాడ్స్ ద్వారా దీనిని 20 రెట్ల నుంచి 2 మిల్లీసెకన్ల వరకు తగ్గించవచ్చు.

Advertisement

Next Story