Global Warming: గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే చర్యలు తీసుకోండి : ప్రపంచానికి యూఎన్ క్లైమేట్ సైన్స్ బాడీ వార్నింగ్

by Prasanna |   ( Updated:2023-03-22 15:56:46.0  )
Global Warming: గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే చర్యలు తీసుకోండి : ప్రపంచానికి యూఎన్ క్లైమేట్ సైన్స్ బాడీ వార్నింగ్
X

దిశ, ఫీచర్స్: రోజు రోజుకూ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలను ప్రపంచం అమలు చేయాలని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ సైన్స్ బాడీ, ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) తన ఆరవ అసెస్ మెంట్ రిపోర్టు (AR6)లో పేర్కొంది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు ఏం చేయాలనేది వివరించింది. పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయు(GHG)వులను తక్షణమే తనిఖీ చేయాలని సూచించింది. అలాగే ప్రతీదానికి చమురు, బొగ్గు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, లేకపోతే 2100 సంవత్సరం నాటికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత తీవ్రమవుతుందని చెప్పింది. దీనివల్ల భూమిపై జీవరాశి మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. 1850 నుంచి ఇప్పటి వరకు ప్రపంచం వాతావరణం 1.2 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కింది. కానీ 2100 సంవత్సరం నాటికి 3.2 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతుంది. ఈ జీవరాశి మనగడను ప్రశ్నార్థకం చేస్తుందని ఐపీసీసీ రిపోర్టు స్పష్టం చేసింది.

క్లైమేట్ చేంజ్‌పై ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సైన్స్ బాడీ హెచ్చరికను లాస్ట్ వార్నింగ్ భావించాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 2018‌లో యూఎన్ నివేదిక చేసిన హెచ్చరికలు, వాతావరణ విషయంలో అనుసరించాల్సిన విధానాలు 2023 నాటికి ప్రపంచం అనుసరించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాత 230 నాటికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే చర్యలు ఆయా దేశాలు చిత్తశుద్ధితో చేపట్టాలని ఐక్య రాజ్య సమితి పేర్కొన్నప్పటికీ ప్రపంచ దేశాలు తగిన విధానాలు అనుసరించలేదని సైంటిస్టులు పేర్కొంటున్నారు. 2021-2022లో విడుదల చేసిన మూడు నివేదికల నుంచి ఇప్పటివరకు ఫలితాలను సమీక్షించిన ఐక్య రాజ్య సమితి క్లైమేజ్ సైన్స్ బాడీ, ఐపీసీసీ సైంటిస్టులు తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. వాతావరణాన్ని వేడెక్కించే చర్యలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని ప్రపంచం వదులుకునే మార్గాలను వివరించింది. కనీసం 2025 నాటికి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని అన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు అమలు చేయాలని సూచించింది. యూఎన్ (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించే యూఎన్ సైన్స్ బాడీ నివేదికను ప్రతీ దేశం, ప్రతీ రంగం సీరియస్‌గా తీసుకొని అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC చైర్ పర్సన్ హోసంగ్ లీ కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి : షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తున్న వైట్ మష్రూమ్స్ !.. తాజా అధ్యయనం

Advertisement

Next Story

Most Viewed