Trending : పార్ట్‌నర్‌తో ఉంటూనే మరో వ్యక్తితో ఎఫైర్..! ఏమిటీ ‘ఓపెన్ రిలేషన్‌షిప్’ కల్చర్?

by Javid Pasha |
Trending : పార్ట్‌నర్‌తో ఉంటూనే మరో వ్యక్తితో ఎఫైర్..! ఏమిటీ ‘ఓపెన్ రిలేషన్‌షిప్’ కల్చర్?
X

దిశ, ఫీచర్స్ : మనం ఏదైతే తప్పు అనుకుంటామో కొందరి దృష్టిలో అది ఒప్పు కావచ్చు. మనం ఏదైతే ఒప్పు అనుకుంటామో మరి కొందరి దృష్టిలో అది తప్పు కావచ్చు. అందుకే మనం అనుకున్నది మాత్రమే కరెక్టని, మనకు నచ్చినట్లు మాత్రమే ఇతరులు నడ్చుకోవాలని అనుకోవడం పెద్ద మూర్ఖత్వమే అవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సువిశాల ప్రపంచంలో ఏ ఒక్కరూ ఒకే విధమైన భావాలను, అలవాట్లను, అభిప్రాయాలను, సంప్రదాయాలను కలిగి ఉండరు. ఇటీవల ట్రెండ్ అవుతున్న ఓపెన్ రిలేషన్‌షిప్ కూడా దాదాపు అలాంటిదే. కొందరికి ఇది నచ్చకపోవచ్చు కానీ, నచ్చినవారు ఫాలో అవుతూనే ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలో ఇదీ ఓ భాగమే కదా అంటుటున్నారు దానిని సమర్థించే నిపుణులు.

మారుతున్న సంబంధాలు

సమాజంలో అన్నీ మారుతున్నట్లే రిలేషన్‌షిప్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. ఆయా దేశాల్లోని కల్చర్‌ను బట్టి, స్థానిక ప్రజల సంప్రదాయాలను బట్టి, ఆసక్తి, అభిరుచులను బట్టి కూడా మానవ సంబంధాలు మారుతుంటాయి. అయితే ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో వరల్డ్‌వైడ్ ఉండే ఇలాంటి వెరైటీ అండ్ పాపులర్ కల్చర్స్ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఓపెన్ రిలేషన్‌షిప్’ కూడా ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇద్దరు పార్టనర్స్ కలిసి ఉంటూనే వారు ఇతర వ్యక్తులతో ఎమోషనల్ లేదా సెక్సువల్ రిలేషన్‌షిప్ కలిగి ఉంటారు. ఇండియాలో దీనిని తప్పుపడతారు. అక్రమ సంబంధంగా భావిస్తారు. కానీ విదేశాల్లో ఇది ఆమోదయోగ్యమైన మానవ సంబంధాల్లో ఒకటి.

ఓపెన్ రిలేషన్‌షిప్‌ అంటే..?

సాధారణంగా ఇద్దరు వ్యక్తులు భార్యా భర్తలుగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటారు. కొందరు సహజీవనం కొనసాగిస్తుంటారు. వీరు తమ వ్యక్తిగత, శృంగార జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని అంగీకరించరు. ఒక వ్యక్తి తన పార్టనర్‌తో కాకుండా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే దానిని మోసంగా, అక్రమ సంబంధంగా పరిగణిస్తారు. కానీ ఓపెన్ రిలేషన్‌షిప్‌లో అలా కాదు, ఇక్కడ ఒక వ్యక్తి ఎవరితో అయితే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తారో వారిని తమ ప్రైమరీ పార్టనర్‌గా భావిస్తారు. కావాలనుకుంటే ఆ పార్టనర్‌తో ఉంటూనే ఇతర వ్యక్తితో కూడా ఎమోషనల్ అండ్ సెక్సువల్ రిలేషన్ కొనసాగించవచ్చు. ఇది పార్టనర్స్ మధ్య అంగీకరాంతోనే జరుగుతుంది. దీనిని మోసంగా, తప్పుగా ఎవరూ భావించరు. ప్రస్తుతం విదేశాల్లో ఈ ట్రెండ్ చాలామంది ఫాలో అవుతున్నారు.

మ్యూచువల్ రెస్పెక్ట్ ముఖ్యం

ఓపెన్ రిలేషన్‌షిప్‌లో కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ అవసరం. అందుకోసం ఓపెన్ కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యమని వాటిని పాటిస్తున్న దేశాల్లోని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటప్పుడే ఇబ్బందులు, పరిమితులు లేకుండా చెట్టాపట్టాలేసుకొని కలిసి తిరగవచ్చు. ఇష్టాయిష్టాలను, అవసరాలను పరస్పరం గౌరవిస్తూ నడుచుకోవచ్చు. కాకపోతే ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం కూడా ముఖ్యం. ఈ సంబంధంలో అసూయ, అభద్రత వంటివి అధిగమించడానికి మ్యూచువల్ రెస్పెక్ట్, ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా చాలా అవసరం. ఈ విధమైన సంబంధాలు భారతీయులకు నచ్చవు కానీ, ఇతర కొన్ని దేశాల్లో ఇదొక సాధారణ విషయం. ఒకే పార్టనర్‌కు పరిమితం కావడంవల్ల తమ వ్యక్తిగత అవసరాలు, ఆసక్తులు తీరవని భావించేవారు ప్రపచంలో చాలా మంది ఉంటారు.

హానెస్ట్‌గా ఉంటూనే..

ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ తమ ప్రైమరీ పార్టనర్ సొంత ఆలోచనలు, ఫీలింగ్స్, ఇతర కోరికల విషయంలో నిజాయితీగా ఉండాలనేది ఈ సంబంధంలోని మరొక ప్రధాన నిబంధన. పైగా తాము ఏం చేస్తున్నారో, ఏ వ్యక్తితో సెక్సువల్, ఎమోషనల్ రిలేషన్ కలిగి ఉన్నారో ప్రైమరీ పార్టనర్‌కు తెలియజేయాలి. ఈ విషయంలో పార్టనర్స్ ఇద్దరూ పరస్పరం గౌరవించుకుంటూనే ఇద్దర అవసరాలను అర్థం చేసుకోవాలి. అంతేకానీ ఇక్కడ అసూయ అభద్రతా భావాలకు, వేధింపులకు అవకాశాలే ఉండవు. ఎందుకంటే అక్కడి సమాజంలో ఇది ఆమోదయోగ్యమైన బంధం. మరో విషయం ఏంటంటే.. ఓపెన్ రిలేషన్‌షిప్ కలిగి ఉండటం, ఉండకపోవడం అనేది కూడా ఆయా వ్యక్తుల ఇష్టం.

జాగ్రత్తలు, పరిమితులు

ప్రైమరీ పార్ట్‌నర్ ఉండగానే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకునే ఓపెన్ రిలేషన్‌షిప్ ఫాలోవర్స్ పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేది కూడా నిపుణులు సూచిస్తున్నారు. సురక్షితమైన లైంగిక పద్ధతులను పాటించడం, గర్భ నిరోధక మాత్రలు, ఇతర విషయాలను ముందుగానే ప్రైమరీ పార్టనర్‌తో చర్చించాలట. అట్లనే తమ గోల్స్, ఓపీనియన్స్, లిమిటేషన్స్ కూడా చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి సొంత నిర్ణయాలను, ఆధిపత్య ధోరణిని వేరొకరిపై బలవంతంగా రుద్ద కూడదు. మొత్తానికి ఓపెన్ రిలేషన్‌షిప్‌ ట్రెండ్ కొనసాగుతున్నచోట ఆ దేశంలో దానికి గల నిబంధనలు, జాగ్రత్తలు, సరిహద్దులు పాటించాలి. పరస్పర నమ్మకంతో నిజాయితీగా నడ్చుకోవాలి.

Advertisement

Next Story