Fasting : శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. ఈ తప్పులు అస్సలే చేయకండి

by Jakkula Samataha |
Fasting : శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. ఈ తప్పులు అస్సలే చేయకండి
X

దిశ, ఫీచర్స్ : శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఉపవాసం ఉంటారు. అయితే ఇలా శ్రావణ మాసంలో ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు కొందరు. కానీ ఫాంస్టింగ్ సమయంలో కొన్ని తప్పులు చేయడం వలన జీర్ణక్రియ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంట. అందువల్ల ఉపవాసం సమయంలో ఈ తప్పులు అస్సలే చేయకూడదు. ఇంతకీ అవి ఏవి అంటే?

ఉపవాసం సమయంలో పెరుగుతో మిల్క్ షేక్స్, పండ్లు అస్సలే తినకూడదు. ఇది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. అలాగే కొంత మంది పూరి లేదా చిప్స్, వేయించిన ఆహారాలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ, ఇది కూడా ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. దీని వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉపవాసం సమయంలో అధిక చక్కెర పదార్థాలు,పాల పదార్థాలు, కొవ్వు అధికంగా ఉండేవి తీసుకోకూడదని, దీని వల్ల జీర్ణ క్రియ ఆలస్యంగా జరిగి, గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. అదే విధంగా కొంత మంది పదే పదే టీ తాగుతుంటారు. కాగా, ఇది కూడా ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు. అందు వలన ఉపవాసం సమయంలో వీలైతే ఎక్కువ నీరు, పండ్లు, హెర్బల్ టీ తాగడం చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

( నోట్ : పై వార్త, నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Next Story

Most Viewed