పెళ్లికి ముందున్న లవ్ స్టోరీ కాబోయే భార్యకు చెబితే జరిగేది ఇదేనంట?

by samatah |   ( Updated:2023-06-07 14:44:55.0  )
పెళ్లికి ముందున్న లవ్ స్టోరీ కాబోయే భార్యకు చెబితే జరిగేది ఇదేనంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లికి ముందు చాలా మందికి లవ్ అనేది ఉంటుంది. చాలా మంది తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తారు, తనతోనే జీవితాంతం కలిసి ఉండాలని ఆరాట పడుతుంటారు. అయితే కానీ కొంత మంది మాత్రమే తమ ప్రేమను సక్సెస్ చేసుకొని సంతోషంగా గడుపుతుంటారు.

అయితే కొంతమంది ప్రేమించిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఇక తనతో జీవితం పంచుకునే అమ్మాయి దగ్గర ఏదీ దాచకూడదు అనే అభిప్రాయంతో తాను గతంలో ప్రేమించిన అమ్మాయి గురించి చెబుతుంటారు. కాగా, అలా చెప్పడం వలన చాలా సమస్యలు ఎదురవుతాయంట.ఇలా చెప్పే ముందు ఒకటి ఆలోచించాలి. మీ జీవిత భాగస్వామికి ఈ విషయం చెప్పే ముందు మీ లవ్ ఎందుకు బ్రేకప్ అయిందో వారికి క్లియర్ గా తెలియజేయాలి. అంతేకాకుండా మీరు ఈ విషయం చెబితే మీ లైఫ్ పార్టనర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో కూడా అర్థం చేసుకొని విషయాలు చెప్పాలంట.ఒకవేళ వారు అర్థం చేసుకుంటే ఓకే కానీ, సరిగా రిసీవ్ చేసుకోకపోతే మాత్రం లేనిపోని అనుమానాలు పెరుగుతాయంట.

Read more: తల్లీ బిడ్డల సన్నిహిత సంబంధం.. ప్రీ మెచ్యూర్ బేబీస్ లో పెరుగుతున్న మనుగడ

Advertisement

Next Story