నగ్నంగా జరుపుకునే పండుగ ఇదొక్కటే.. పాపాలు పోవాలంటే ఆడ, మగ కలిసి..

by Sumithra |
నగ్నంగా జరుపుకునే పండుగ ఇదొక్కటే.. పాపాలు పోవాలంటే ఆడ, మగ కలిసి..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో వింత సాంప్రదాయాలు, సంస్కృతులు కనిపిస్తాయి. అలాగే అనేక దేశాల్లో వింత ఆచారాలతో పండుగలను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే జపాన్‌లో కూడా ఓ వింత ఆచారంతో పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ శనివారం ఈ పండగను జరుపుకుంటారు. ఈ పండగను అర్ధనగ్నంగా జరుపుకోవడం అక్కడ వారి ఆచారం. ఈ పండగనే నేకెడ్ ఫెస్టివల్ అని పిలుస్తారు. జపాన్‌లో ఈ పండగకు ఎంతో క్రేజ్ ఉంటుంది.

'నేకెడ్ ఫెస్టివల్ లో పాల్గొనే వ్యక్తులు పూర్తిగా నగ్నంగా ఉండరు. ఇందులో పాల్గొనేవారు తెల్లని లంగోటీలు ధరిస్తారు. ఈ ప్రాంతంలో చలికాలం మొదలయ్యే సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండగలో పురుషులు, మగపిల్లలు పాల్గొని పట్టణంలో గంటల తరబడి నడుము కట్టుకుని తిరుగుతుంటారు. చివరగా ఈ వేడుకలో స్థానిక మందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాత పురుషులు చెరువులోకి దూకడం ప్రారంభిస్తారు. పండుగ ఆచారం సాధారణంగా సైదాయి-జీ ఆలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్న సమయంలో, లంగోటీలు ధరించిన మగవారు మంచుతో నిండిన చల్లని కొలనులో దిగుతారు. 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ నగ్న ఉత్సవానికి సైదాయి - జీ దేవాలయం జన్మస్థలం అని నమ్ముతారు.

ప్రతి ఏడాది పురుషులు మాత్రమే జరుపుకునే ఈ పండుగ ఆచారాలలో ఈసారి 40 మంది మహిళలు కూడా పాల్గొననున్నారు. ఈ పండుగ సమయంలో పురుషులు ఎలా ఉన్నా మహిళలు మాత్రం పూర్తి దుస్తులు ధరించి, వారికి దూరం పాటించాలని షరతులు విధించారు. జపాన్ చరిత్రలో ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని చెబుతున్నారు. ఈ నిర్ణయం గురించి నిర్వాహక కమిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ, మహమ్మారి కారణంగా, గత రెండేళ్లుగా ఈ పండుగను నిర్వహించలేక పోతున్నామని, నగరంలోని మహిళలు చాలా కాలంగా ఇందులో పాల్గొనాలని కోరుతున్నారు. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ ప్రాంతంలోని మహిళలు ఆనందం వ్యక్తం చేశారని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed