- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టమాటా ధరలు మండిపోతున్నాయా.. కూరల్లో వాటికి బదులు ఇవి వేస్తే టేస్ట్ అదుర్స్..
దిశ, వెబ్‌డెస్క్ : టమాటాలు ప్రతి ఇంట్లోను నిత్యావసర పదార్థాల్లో ఒకటిగా మారిపోయింది. కూరలకి రుచి రావాలన్నా, కూరల్లో గ్రేవీ ఉండాలన్నా టమాటాలను ఖచ్చితంగా వేస్తాం. అయితే గతవారం రోజులుగా టమాటధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. నిన్నమొన్నటి వరకు 10 రూపాయల నుంచి 50 రూపాయలు పలికిన టమాట ధర ఒక్కసారిగా 100 రూపాయల నుంచి 120 వరకు పెరిగిపోయింది. దీంతో పేద, మధ్యతరగతి వారు టమాటను కొనడానికి వెనకాడుతున్నారు. అయితే టమాటాలకు ప్రత్యామ్నాయంగా కొన్ని ఇంగ్రీడియన్స్ ను ఉపయోగించి మీరు చేసే వంటకు రంగు, రుచిని తీసుకురావచ్చు. మరి ఆ ప్రత్యామ్నాయ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉసిరి పొడి టమాటాకు మంచి రీప్లేస్‌మెంట్ ఇంగ్రీడియన్ అనొచ్చు. ఈ పొడిని కూరల్లో తగినంతగా వేస్తే చాలు పుల్లటి రుచిని కూర పుల్లగా ఉండి కూరకి రుచిని ఇస్తుంది. అలాగే వెనిగర్ ని కూడా వంటల్లో వేసుకుంటే కర్రీస్ పుల్లగా ఉండడమే కాదు మంచి రుచిని కలిగి ఉంటాయి. ఇక వేసవికాలంలో మనందరికి అందుబాటులో ఉండే పుల్లటి మామిడికాయను కూరల్లో వేసుకుంటే మంచి టేస్ట్, పులుపుదనం వస్తుంది. ఇక అన్ని సీజన్లలోనూ అందరికి అందుబాటులో ఉండే చింతపండును కూడా టమాటాలకు బదులుగా వాడవచ్చు. టమాటాలకు బదులు చింతపండు గుజ్జును వాడితే మంచి రుచి వస్తుంది. ఇది కూరకు పులుపుతో పాటు చిక్కదనాన్ని కూడా ఇస్తుంది.
గ్రేవీ, కలర్ రావాలంటే..
టమాటలు వాడకుండా కూరలో గుజ్జు రావాలంటే ఉల్లిపాయలను వాడవచ్చు. అది ఎలాగంటే ఉల్లిపాయలను దోరగా వేయించి దాన్ని పేస్ట్ లా చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఇక రంగుకోసం టమాటాకు బదులు ఎర్ర రంగు క్యాప్సికమ్‌ను కూరల్లో వాడొచ్చు. చూశారుగా టమాట ధరలు కొండెక్కినప్పుడు టమాటాలకు బదులు ఏం ఇంగ్రీడియన్స్ ని వేసి వంటలు చేసుకోవచ్చో.