- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాషింగ్ మెషిన్‌లో వీటిని అస్సలు ఉతకకూడదు..!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి వచ్చిన తరువాత బట్టలు ఉతకడం నిమిషాల్లో అయిపోతుంది. అయితే, చాలామంది ఈ మెషిన్ వాడేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల బట్టలు పాడైపోతాయి. ఇందులో అన్నీ రకాల దుస్తులను కలిపి ఉతికేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బట్టల నాణ్యత, రంగు త్వరగా దెబ్బతింటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాషింగ్ మెషిన్‌లో ఎలాంటి దుస్తులు ఉతకకూడదు?
* సిల్క్ దుస్తులు చాలా సున్నితంగా ఉంటాయి. చాలామంది మాములు బట్టలతో పాటుగా ఈ సిల్క్ దుస్తులను కూడా వాషింగ్ మెషిన్‌లో వేస్తుంటారు. ఈ మెషిన్ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. దీని వల్ల సిల్క్ దుస్తుల మెరుపు, నాణ్యత తగ్గిపోతుంది. వీటిని వాషింగ్ మెషిన్‌లో వేయడం కంటే చేతితో ఉతకడం ఉత్తమం.
* సున్నితంగా ఖరీదైన లో దుస్తులను వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతకకూడదు. ముఖ్యంగా ప్యాడ్లు ఉన్న బ్రాలను మెషిన్‌లో వేయకూడదు. ఎందుకంటే మెషిన్‌లో వేయడం వల్ల బ్రాల ప్యాడ్లు చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* ఉన్ని దుస్తులను ఎప్పుడూ వాషింగ్ మెషిన్‌లో వేయకూడదు. ఉన్ని చాలా మృదువుగా ఉంటుంది. ఈ దుస్తులను మెషిన్‌లో వేయడం వల్ల తొందరగా పాడైపోతుంటాయి.
* స్టడ్స్, ఫ్రిల్స్ దుస్తులను అస్సలు వాషింగ్ మెషిన్‌లో వేయకూడదు. ఒక వేళ వాషింగ్ మెషిన్‌లో వీటిని వేస్తే, వీటి బటన్లు లేదా చైన్లు మెషిన్‌లో ఇరుక్కునే అవకాశం ఉంది. దీని వల్ల మెషిన్ పాడైపోతుంది.
* బ్లేజర్లను ఉతకడానికి ఎప్పుడూ కూడా వాషింగ్ మెషిన్ ఉపయోగించకూడదు. ఒకవేళ మెషిన్‌లో వేసి ఉతికినట్లైతే సూట్ ఫిట్టింగ్‌లో మార్పులు వచ్చి, అది పాడైపోతుంది. వీటిని ఎప్పుడూ డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలి.
* చాలామంది కిచెన్‌లో వాడే క్లీనింగ్ దుస్తులను కూడా వాషింగ్ మెషిన్‌లో వేస్తుంటారు. అలా వేయడం వల్ల దుస్తులకు ఉన్న నూనె, ఇతర మరకలు మెషిన్‌లోనే ఉండిపోతాయి.
* ఎంబ్రాయిడ్ దుస్తులను మెషిన్‌లో అస్సలు వేయకూడదు. ఫ్రాక్స్, ముత్యాలు, ఎంబ్రాయిడ్ చేయించిన దుస్తులను చేతితో ఉతకడం లేదా డ్రై క్లీన్‌కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ దుస్తులపై ఉండే స్టోన్స్ విరిగిపోయి, దుస్తులు పాడైపోతాయి. వాషింగ్ మెషిన్‌లో వేయడం వల్ల విరిగిన స్టోన్స్, మెషిన్‌లోని పరికరాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దీని వల్ల మెషిన్ పాడైపోతుంది.
* కొందరు రెయిన్ కోట్‌లను వాషింగ్ మెషిన్‌లో ఉతుకుతుంటారు. దీని వల్ల అవి చిరిగిపోతాయి. ముఖ్యంగా వాటర్ ఫ్రూఫ్ రెయిన్ కోట్స్‌ను మెషిన్‌లో వేయకూడదు. వీటి వల్ల మెషిన్ కూడా పాడవుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.