Non Veg : మీరు నాన్ వెజ్ ప్రియులా.. ఈ నగరాలకు వెళ్లారంటే వెజ్ తో సరిపెట్టుకోవాల్సిందే..

by Sumithra |
Non Veg : మీరు నాన్ వెజ్ ప్రియులా.. ఈ నగరాలకు వెళ్లారంటే వెజ్ తో సరిపెట్టుకోవాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో 39 శాతం మంది శాకాహారులు అయితే, నాన్ వెజ్ తినే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలైతే ముక్కలేనిదే ముద్ద తినలేం అంటుంటారు. వారానికి కనీసం మూడు, నాలుగు రోజులైనా నాన్ వెజ్ తింటూనే ఉంటారు. అలాంటి వారు ట్రావెలింగ్ లో, వెకేషన్ లో కూడా నాన్ వెజ్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అయితే కొన్ని నగరాలకు అలాంటివారు వెళితే మాత్రం పాపం మాంసాహారం లేక విలవిల లాడాల్సిందే. ఇంతకీ ఆ నగరాలు ఏంటి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

కృష్ణుని నగరం బృందావనం - మధుర..

బృందావనం, మధుర ఈ రెండూ శ్రీకృష్ణుడు వెలసిన నగరాలు. ఇక్కడికి నిత్యం శ్రీ కృష్ణుని భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అందుకే ఈ నగరం అంతా కన్నయ్య కీర్తనలతో మారుమోగుతూ ఉంటుంది. ఈ ప్రాంతానికి వచ్చేవారంతా భక్తులు కావడంతో ఇక్కడి రెస్టారెంట్లలో శాఖాహారం తప్పించి మాంసాహారం అస్సలు చేయరు. మధురలో కూడా నాన్ వెజ్ దొరకదు.

హరిద్వార్, రిషికేశ్..

హరిద్వార్, గంగా మాత నగరం, ఆధ్యాత్మికత విశ్వాసానికి కేంద్రంగా ఉంది. అదేవిధంగా, చాలా మంది ప్రజలు ఆధ్యాత్మిక శాంతి కోసం రిషికేశ్ వెళుతుంటారు. ఈ రెండు నగరాల్లోనూ మీకు శాకాహారమే ఎక్కువగా లభిస్తుంది.

వారణాసి..

భక్తుల కోరికలు తీరుస్తూ భోలాశంకరుడు వెలసిన క్షేత్రం వారణాసి. అంతే కాదు గంగానది అందమైన ఘాట్‌లు వారణాసిలో దర్శనం ఇస్తాయి. శివుని భక్తులకు విశ్వాస కేంద్రంగా ఉంటుంది. వారణాసి క్షేత్రంలో శివున్ని ఆరాధించే భక్తులతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులతో కూడా నిండి ఉంటుంది. అయితే వారణాసిలో కూడా నాన్ వెజ్ ఫుడ్ జాడ దొరకదు.

మదురై..

దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడులోని మదురై నగరంలో శాఖాహారం ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల విశ్వాసానికి కేంద్రం మీనాక్షి సుందరేశ్వర ఆలయం. అంతే కాదు అనేక ఇతర పురాతన దేవాలయాలు కూడా ఇక్కడ దర్శనం ఇస్తాయి. అందుకే ఈ నగరంలో కూడా నాన్ వెజ్ దొరకదు.

పాలిటానా నగరం..

ఇకపోతే ఇటీవలి కాలంలో గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న పాలిటానా అనే నగరంలో నాన్ వెజ్ ను బ్యాన్ చేశారు. దీంతో పాలిటానా మాంసాహారాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొదటి నగరంగా అవతరించింది.

Advertisement

Next Story

Most Viewed