- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆత్మ విశ్వాసం పెంచుకునేందుకు బెస్ట్ టిప్స్ ఇవే!
దిశ, ఫీచర్స్ : సక్సెస్ కావాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆత్మ విశ్వాసం ఉంటే ఎంత కష్టమైన పనైనా సరే ఇట్టే చేయవచ్చునంట. అలాగే మనం చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తుంటాయి. అయితే కొంత మందిలో ఆత్మవిశ్వాసం అస్సలే ఉండదు. నెగిటివ్‌గా థింక్ చేస్తూ నేను ఏం చేయలేను, అని బాధపడిపోతారు. సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడిపోతారు. అలాంటి వారికోసమే ఆత్మ విశ్వాసాన్ని పెంచే బెస్ట్ టిప్స్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
భయపడటం అనేది సహజం. కానీ దీన్ని వదిలి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఓడిపోతామో అని భయపడకుండా.. నేనే గెలుస్తాను అనే ధీమతో ప్రతీ పని చేపట్టాలి. దీని వలన సక్సెస్ నీ సొంతం అవుతుంది. అలాగే ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదు. పోల్చుకోవడం వలన అసూయ ఏర్పడి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
మన మనసుకు నచ్చిన వారితో మాట్లాడాలి. ఎవరైతే నిన్ను సపోర్టు చేస్తారో, నువ్వు చేయగలవు అనే ధైర్యం ఇస్తారో, వారితో ఎక్కువ సేపు గడపడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుందంట.
ఒకసారి పొరపాటు జరిగితే దాన్ని తలుచుకుంటూ బాధపడకుండా, తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి. నా వల్ల కాదు నేను చేయలేను అని కాకుండా నాతో సాధ్యమవుతుంది అనే నమ్మకంతో ప్రతీ పని చేపట్టాలి. ఇలా చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.