- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ నది.. పింక్ ఫ్లవర్స్‌తో ఆకట్టుకుంటున్న టూరిస్ట్ ప్లేస్
దిశ, ఫీచర్స్ : మన దేశంలో అందమైన, అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వీటిలో కేరళ ఒకటి కాగా.. ఆ రాష్ట్రానికి చెందిన కోజికోడ్‌లోని ఓ నది గులాబీమయమై పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పింక్ కలర్‌లో ఉండే 'ఫోర్క్డ్ ఫ్యాన్‌వోర్ట్' పువ్వులు కనుచూపు మేర నిండిపోయి చూస్తున్న ప్రతీ ఒక్కరికి అందమైన అనుభూతిని అందిస్తున్నాయి.
ఇక ఈ అందమైన దృశ్యంపై ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహేంద్ర కూడా స్పందించారు. 'ఈ గ్రామానికి పర్యటకులు తరలి రావడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఈ ఫొటో నాలో ఉత్సాహాన్ని, ఆశావాద భావాన్ని పెంచుతుంది' అని తెలిపారు. దీంతోపాటు ఈ ఫొటోను నా కొత్త స్క్రీన్ సేవర్‌గా పెట్టుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన ఆయన.. ఈ ఫొటోకు 'రివర్ ఆఫ్ హూప్'అని పేరు పెట్టుకుంటున్నానని అన్నారు. ఇకపోతే కేరళలో ఉండే ఈ పింక్ నది ఫొటోలు వైరల్ అవడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2020 నవంబర్‌లో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.
#Throwback
— The Better India (@thebetterindia) May 6, 2022
A river in Kerala's Kozhikode district had turned pink, thanks to millions of forked fanwort flowers that have blossomed in its waters. Located in Avala Pandi village, the river has since then been attracting tourists in droves.
PC: Deepesh John Photography pic.twitter.com/SozhGZK0zt