- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మానవుడిని సృష్టించింది బ్రహ్మ దేవుడు కాదా.. కుంభమేళా వేళ ప్రకంపనలు సృష్టిస్తున్న సైంటిస్టుల నివేదిక!

దిశ, ఫీచర్స్: దేవుడు మానవుడిని ఎలా తయారు చేశాడు? మట్టి ముద్దతోనా లేదా పిండితోనా? నిజంగా మనిషిని చెక్కింది ఆ పరబ్రహ్మే అంటారా? భూమిపై జీవం పుట్టుకొచ్చింది ఎలా? అసలు దేవుడు ఉన్నాడా? ఓ వైపు మహాకుంభమేళా(Mahakumbh Mela) జరుగుతుంటే ఇలాంటి ప్రశ్నలు సంధించడం సరికాదు.. కానీ వీటన్నింటికి మన దగ్గర సమాధానం లేదు. సాక్ష్యాలు కూడా లేవు. కానీ తాజా అధ్యయనం మాత్రం ఇదంతా స్టార్ డస్ట్ వల్ల జరిగిందని చెప్తుంది. అవును బెన్నూ అనే ఉల్కకు సంబంధించిన నమూనాలో జీవానికి అవసరమైన సేంద్రీయ సమ్మేళనాలు(Organic compounds), ఖనిజాలను(minerals) గుర్తించినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. మానవులతో సహా భూమిపై ఉన్న అన్ని జీవులు స్టార్ డస్ట్‌తోనే రూపుదిద్దుకున్నాయనే సాక్ష్యాలున్నాయని చెప్తున్నారు.
‘‘నిజానికి గ్రహశకలాలు మిలియన్ల సంవత్సరాల క్రితం భూమికి లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్‌గా పనిచేశాయి. బెన్నూ వంటి గ్రహశకలాలు అంతరిక్షంలో రసాయన కర్మాగారాల వలె వర్క్ చేశాయి. ఇవి భూమితోపాటు సౌర వ్యవస్థలోని జీవం కోసం ముడి పదార్థాలను అందించాయి’’ అని శాస్త్రవేత్తలు వివరించారు. నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం గ్రహ శకలం నమూనాల్లో లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అయినా అమైనో ఆమ్లాలు, డీఎన్‌ఏ కాంపౌండ్స్, లవణాలు, ఖనిజాలు(minerals) వంటివి కనుగొన్నట్లు వెల్లడించారు. కాగా ఈ సాంపిల్స్ భూ వాతావరణంలో కంటామినేట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నాసా వెల్లడించింది.