హలాలు పట్టి, పొలాలు దున్నే రైతన్నలకు.. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు

by samatah |   ( Updated:2022-06-14 07:08:51.0  )
హలాలు పట్టి, పొలాలు దున్నే రైతన్నలకు.. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏరువాక సాగాలో రన్నో చిన్న అన్నా.. అనే పాట మనందరికి తెలిసిందే. జూన్ మొదటి వారంలో వాన జల్లు తొలకరి పిలుపుతో రైతన్న మొఖంలో ఆనందం, ఆరుద్రపురుగుల పరుగులు.. లేగదూడల ఊరుకులాట, పిల్లకాలువల సవ్వళ్లు వీటన్నింటి కలయికే ఏరువాక పౌర్ణమి. ఇది వ్యవసాయానికి సంబంధించిన పండుగ. వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజిస్తారు ఈరోజు. వర్షకాలం ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా పలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఈ రోజు రైతన్నకు ఎంతో ఇష్టమైనరోజు.. ప్రకృతి ఆశీస్సులు, పుడ‌మిత‌ల్లి క‌రుణతో రైత‌న్నలు సాగు చేసిన పంట‌లు అధిక దిగుబ‌డులు ఇచ్చి, రైత‌న్నల జీవితాల్లో సంతోషాలు నింపాల‌ని కోరుకుంటూ.. తెల్లవారు జామునే ఎద్దులకు స్నానాలు చేయించి వాటిని అందంగా అలంకరించి, భూమికి పూజ చేసి పొలం పని మొదలు పెడుతాడు రైతన్న.

అంతే కాకుండా, వర్షబుతువు మొదలయ్యాక జేష్ఠ్యా నక్షత్రంలో తన నిండైన రూపంతో చందమామ దర్శనం ఇచ్చేది ఈరోజే. దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కరువు కాటకాలు రాకుండా వర్షాలు సమృద్ధిగా పడి, పాడి పంటలతో రైతులు ఆనందంగా ఉండటానికి నాంది పడే రోజే ఈ ఏరువాక పౌర్ణమి రోజు.

Advertisement

Next Story