- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెదడులో నొప్పి గ్రాహకాలు ఉండవు.. అయినా తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?
దిశ, ఫీచర్స్: మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే.. మానవ మెదడులో నొప్పి గ్రాహకాలు (pain receptors) ఉండవు. అందుకే కొన్ని సందర్భాల్లో బ్రెయిన్‌కు సంబంధించిన సర్జరీలను డాక్టర్లు పేషెంట్ మేల్కొని ఉన్న స్థితిలోనే చేస్తుంటారు. అయితే బ్రెయిన్ నొప్పిని గుర్తించలేనప్పుడు తలనొప్పి ఎందుకు వస్తుందనేది సాధారణంగా అందరికీ వచ్చే అనుమానం. అందుకు వేరే కారణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.
మానవ శరీరం, అవయవాల గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ ఇంకా తెలియని విషయాలు కూడా ఉంటాయి. ప్రతీసారి అవయవాల పనితీరుకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. మెదడులో నొప్పి గ్రాహకాలు ఉండవనేది కూడా అలాంటిదేనని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అరవింద్ భటేజా అంటున్నారు.
నొప్పికి కారణమిదే
న్యూరాలజిస్టుల ప్రకారం.. మెదడులో నొప్పి గ్రాహకాలు లేకపోయినప్పటికీ తల, కళ్లు, ముక్కు, సైనస్‌లు, చెవులు, దంతాలతో సహా ఇతరాలు శరీర భాగాలు ఉంటాయి. అదనంగా బ్రెయిన్ కవరింగ్ (also called meninges) పుర్రె ఎముకలతో(skull bones) పాటు నొప్పి గ్రాహకాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు తల, మెడ ప్రాంతంలో రక్తనాళాలు, కండరాలు, నరాలు వంటివి మెదడు చుట్టూ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి హానికరమైన ఉద్దీపనలను గుర్తించగల నోకిసెప్టర్లతో అమర్చబడి ఉంటాయి.
అయితే ఇవి స్ట్రెస్, డీ హైడ్రేషన్, నిద్రలేమి, సైనస్ ఇన్‌ఫెక్షన్స్, మైగ్రేన్ వంటి వివిధ కారణాలవల్ల ప్రేరేపించబడినప్పుడు. సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ద్వారా మెదడుకు నొప్పికి సంబంధించిన సిగ్నల్స్‌ను అందుతాయి. ఈ కారణంగానే మనకు తలనొప్పి వస్తుందని ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ ఓక్(Dr Oak) తెలిపారు. కొన్ని రకాల బ్రయిన్ సర్జరీల సందర్భంలో పేషెంట్ మేల్కొని ఉన్నప్పుడు ఆపరేషన్ చేసినా నొప్పి కలుగకపోవడానికి రీజన్ అది ‘బ్రెయిన్ కవరింగ్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్’ ప్రభావితం కానటువంటి శస్త్ర చికిత్స అయి ఉంటుంది. ఒకవేళ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటే గనుక డాక్టర్లు లోకల్ అనస్థీషియా ఇచ్చి సర్జరీలు చేస్తారు. దీనివల్ల నొప్పి తెలియదు.
Read More: మంటల్లో కాల్చిన ఆహారంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్.. అసలు రీజన్ అదే!