తస్మాత్ జాగ్రత్త: ప్లాస్టిక్ బాటిల్‌తో పిల్లలకు ఫీడ్ చేస్తున్నారా..? అయితే డేంజర్‌లో పడ్డట్టే

by Kavitha |
తస్మాత్ జాగ్రత్త: ప్లాస్టిక్ బాటిల్‌తో పిల్లలకు ఫీడ్ చేస్తున్నారా..? అయితే డేంజర్‌లో పడ్డట్టే
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా పిల్లలకు పాలు తాగించడానికి అందరూ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తారు. అవి తక్కువ ధరకు దొరకడం మూలాన ఎక్కువ మంది వీటినే వాడతారు. అయితే చాలా మంది పిల్లల తల్లులు ఈ బాటిళ్లను వేడి నీటిలో కడిగి, క్లీన్ చేసి మళ్లీ ఉపయోగిస్తున్నారు. కానీ, ఇలా చేయడం వల్ల బిడ్డ శరీరానికి చాలా హాని కలుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

*ప్లాస్టిక్ బాటిళ్లను హాట్ వాటర్‌తో క్లీన్ చెయ్యడం, అలాగే వేడిగా ఉన్నప్పుడే పాలను బాటీల్‌లో ఫిల్ చేయడం మానుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేడినీరు బాటిల్‌లోని మైక్రోప్లాస్టిక్లను పాలు లేదా నీటితో కలిపి శిశువు శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది.

*అలా ఈ మైక్రోప్లాస్టిక్లు శిశువు కడుపు, మెదడుకు హాని కలిగిస్తాయి. కాబట్టి పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గాజు లేదా స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించాలి. ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్ ఉపయోగిస్తుంటే.. దానిని వేడి చేయవద్దు.

*అదేవిధంగా ప్లాస్టిక్ బాటిళ్లను వేడి చేసినప్పుడు వాటి నుండి BPA, Phthalates విడుదలవుతాయి. దీని కారణంగా, పెరుగుతున్న పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.

*ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి కూడా హానికరం. కాలక్రమేణా, ప్లాస్టిక్ సీసాలు గీతలు పడి.. అందులో బ్యాక్టీరియా చేరుతాయి. అలా ఆ పాలను పిల్లలకు తాపియడం వల్ల వారు త్వరగా అనారోగ్యం పాలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బాటిల్‌ను తరచూ మార్చడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.

*ప్లాస్టిక్ సీసాలు కొన్నిసార్లు పాల రుచి, వాసనను కూడా మారుస్తాయి. ఈ కారణంగానే పిల్లలు పాలు తాగేందుకు నిరాకరిస్తున్నారు. అయితే స్టీల్, గ్లాస్ బాటిల్‌తో ఇలా జరగదు. అందువల్ల, పిల్లల ఆరోగ్యానికి ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ బాటిల్ సరైన ఎంపిక.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed