వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వేధిస్తోందా? ఈ పండుతో చెక్ పెట్టండి!

by Anjali |   ( Updated:2023-05-29 07:55:19.0  )
వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వేధిస్తోందా? ఈ పండుతో చెక్ పెట్టండి!
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి వస్తే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఎన్నో పోషకాలతో కూడుకొన్న మామిడి పండ్లు. ఎక్కడ చూసిన నోరూరించే మామిడి పండ్లే దర్శనమిస్తుంటాయి. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటితో ఎండాకాలంలో వేధించే డీహైడ్రేషన్‌, వడదెబ్బ సమస్యలను సులభంగా చెక్ పెట్టొచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

* ఒక మామిడి కాయను తీసుకొని వాటర్‌లో క్లీన్‌గా కడిగి పీల్ తొలగించి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

* మామిడి ముక్కల్లో హాఫ్ టేబుల్ స్ఫూన్ అల్లం ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు 5 లేదా 6 పుదీనా ఆకులు హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రాండ్ చేయాలి.

* తర్వాత కప్పు పెరుగు, రెండు గ్లాసుల నీళ్లు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.

* అంతే సూపర్ సమ్మర్ మ్యాంగో రిఫ్రెషింగ్ డ్రింక్‌ రెడీ అయినట్లే. ఈ డ్రింక్ తాగితే బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

* నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

* వేసవి వేడి కారణంగా ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పి వస్తుంది.

* ఆ సమయంలో మామిడికాయతో ఈ రిఫ్రెషింగ్ డ్రింక్‌ను తయారు చేసుకుని తాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

* అలాగే ఇమ్యూనిటీ ఫవర్‌తో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది.

Read more:

వేసవిలో బాదం పప్పు నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Grapes: ద్రాక్షపండ్లతో ఈ వ్యాధులను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా?

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed