Snake: గర్భిణీ స్త్రీలను పాములు కాటు వేయవు.. దాని వెనుకున్న శాపమేంటో తెలుసా..?

by Prasanna |
Snake: గర్భిణీ స్త్రీలను పాములు కాటు వేయవు.. దాని వెనుకున్న శాపమేంటో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పాములు ( Snakes) కనిపిస్తే మనలో చాలా మంది దూరంగా పారిపోతుంటారు. కానీ, పాములకు అపకారం చేయాలని చూస్తే అవి పగ బడతాయని చెబుతుంటారు. అయితే, గర్భిణీలను కాటేయవని చెబుతున్నారు. దీని వెనుక పురాణ కథలు ఉన్నాయి. అవి ఏం చెబుతున్నాయో ఇక్కడ చూద్దాం..

పూర్వంలో పాముల్ని నాగ దేవతలుగా కొలుస్తుంటారు. అయితే, పాములకు ఆపద కల్గించకూడదని అంటున్నారు.ముఖ్యంగా, రైతులతో పాములకు మంచి స్నేహం ఉంటుంది. ఎందుకంటే, ఎంతో మంది రైతులు పాములకు భయపడకుండా పొలం పనులు చేసుకుంటున్నారు. అయితే, పాములు మాత్రం గర్భవతుల్ని కాటు వేయవట.

ఒకప్పుడు ఓ మహిళ తపస్సు చేస్తున్నప్పుడు రెండు పాములు వచ్చాయంట. అప్పుడు ఆ పాములు ఆమె తపస్సును చేసుకోనివ్వకుండా చేశాయట. దీంతో ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న గర్భిణీలు దగ్గరకు వెళ్తే కళ్లు పోతాయని శపించిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ..ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు

Advertisement

Next Story

Most Viewed