- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కనుమరుగవుతున్న లేత రంగు సీతాకోక చిలుకలు.. ఎందుకంటే?

దిశ, ఫీచర్స్: గ్లోబల్ వార్మింగ్ మధ్య శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో లేత రంగు రెక్కలు కలిగిన చిన్నటి సీతాకోకచిలుకలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు అంటున్నారు. ఇటీవల వాటి జీవన మనుగడను తెలుసుకోవడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సీతాకోక చిలుకల్లోని థర్మల్ బఫరింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆరు సీతాకోకచిలుక ఫ్యామిలీస్ నుంచి 54 జాతులకు ప్రాతినిధ్యం వహించే 1,334 బట్టర్ ఫ్లైస్‌ను పరీక్షించించారు.
ముదురు రంగులో ఉండే పెద్ద రెక్కలు కలిగిన విభిన్న జాతుల సీతాకోక చిలుకల మాదిరి లేతరంగు రెక్కలు కలిగిన చిన్న సీతాకోక చిలుకలు మారుతున్న పర్యావరణ వ్యవస్థలో మనుగడ సాగించేందుకు ఇబ్బంది పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గాలి కాలుష్యం, అధికస్థాయి ఉష్ణోగ్రతలను అవి తట్టుకోలేకపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా లైకెనిడే ఫ్యామిలీకి (Lycaenidae family) చెందిన స్మాల్ బట్టర్‌ఫ్లైస్ త్వరగా అంతరించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. లేతరంగు, ముదురు రంగు రెక్కలలో ప్రొటీన్‌లను స్థిరీకరించడానికి, నియంత్రించడానికి దోహద పడే అణువుల మార్పులు, థర్మల్ బఫరింగ్, థర్మల్ టాలరెన్స్ అనే ప్రక్రియలు సీతాకోక చిలుకల మనుగడను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు అంటున్నారు.