Skin health : మీ స్కిన్ టైప్ ఏది..? ఎలా డిసైడ్ అవుతుందో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-11-29 16:18:52.0  )
Skin health : మీ స్కిన్ టైప్ ఏది..? ఎలా డిసైడ్ అవుతుందో తెలుసా?
X

దిశ,ఫీచర్స్ : మానవ శరీరంలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది చర్మమే. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడం, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీ చర్మ రకాలపైన అవగాహన అవసరం. ఎందుకంటే ఒక్కో టైప్ రకానికి ఒక్కో విధమైన సంరక్షణ పద్ధతులు, ఉత్పత్తులు అవసరం అవుతుంటాయి. అంతేకాకుండా ఇటీవల అందం, ఆరోగ్యం వంటి విషయాలపట్ల యువతలో ఆసక్తి బాగా పెరుగుతోంది. ఉన్నంతలో అట్రాక్టివ్‌గా కనిపించాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే మీ స్కిన్ టైప్ గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది అంటున్నారు డెర్మటాలజిస్టులు. అయితే చర్మ రకాలు ఎన్ని? ఎలా ఏర్పడతాయి? దేనికి ఎలాంటి కేర్ అవసరమో చూద్దాం.

ఎలా డిసైడ్ అవుతుంది?

ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన చర్మ తత్వాన్ని లేదా రకాన్ని కలిగి ఉంటారు. ఆయా వ్యక్తుల జీవన శైలులతోపాటు జన్యుశాస్త్రం, ఏజ్, హార్మోన్లు, ఒత్తిడి, ఆహారం, యాక్టివిటీస్ లెవల్స్, ఎన్విరాన్ మెంటల్ ఫ్యాక్టర్స్ వంటివి ఇందులో కీలకపాత్ర పోషిస్తాయని అమెరికన్ అకాడెమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) అధ్యయనం పేర్కొంటున్నది. దీని ప్రకారం.. పొడి చర్మం (oily), జిడ్డు చర్మం(oily), నార్మల్ స్కిన్, కాంబినేషన్ లేదా సెన్సిటివ్ స్కిన్.. ఇలా మొత్తం 5 రకాలు ఉన్నాయి.

పొడి చర్మం

మీ బాడీలో తగినంత సెబమ్‌ను(sebum) ఉత్పత్తి కానప్పుడు సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. దీనిని బట్టి మీది డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. నిజానికిది స్మాల్ ఫంగల్ వల్ల ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లకు కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్మ రకం ఉన్నప్పుడు సంరక్షణ కోసం తేమగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకోసం ఒక సున్నితమైన క్లెన్సర్ అండ్ హ్యూమెక్టెంట్స్ కలిగి ఉండే మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.

జిడ్డు చర్మం

జిడ్డు చర్మం లేదా ఆయిలీ స్కిన్ టైప్ కలిగి ఉన్నట్లయితే సెబమ్ (జిడ్డు) అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల స్వేద రంధ్రాలు విస్తరిస్తాయి. అలాగే ఇది మెరుస్తున్న జిడ్డు చర్మానికి దారితీస్తుంది. కొన్నిసార్లు స్వేద రంధ్రాలు మూసుకుపోయి మెటిమలు ఏర్పడి సమస్యగా మారతుంటాయి. ఇలాంటి చర్మ సంరక్షణ కోసం బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేషియల్ క్లెన్సర్‌ను యూజ్ చేయడం ముఖ్యం. అలాగే ‘‘నాన్ కామెడోజెనిక్’’ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం కూడా ప్రయత్నించవచ్చు. మరొక విషయం ఏంటంటే.. జిడ్డు చర్మ రకం ఉన్నవారు వ్యాయామాలు చేసిన తర్వాత వెంటనే తలస్నానం చేయడం వల్ల మొటిమలు, దద్దుర్లు వంటివి రాకుండా ఉంటాయి.

కాంబినేషన్ స్కిన్ టైప్

కొన్నిసార్లు డ్రైగా, కొన్ని సార్లు ఆయిలీగా ఉండే కాంబినేషన్ స్కిన్ టైప్ కలిగి ఉన్నట్లయితే.. మీ ఫేస్ ఏరియాలు డిఫరెంట్ స్కిన్ టైప్స్‌ను ప్రదర్శిస్తుంటాయి. ఇలాంటప్పుడు తదనుగుణంగా కేర్ తీసుకోవడం ముఖ్యం. అవసరమైనప్పుడు ట్రీమ్మెంట్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్మ తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దానికి తగిన ప్రొడక్ట్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు కొనుగోలు చేసే ఉత్పత్తుల లేబుల్స్ తప్పక చెక్ చేయండి. ప్రతీ ఐటమ్‌లో మీ స్కిన్ టైప్‌ను టార్గెట్ చేసుకొని వివిధ పదార్థాలు ఉంటాయి. ఏది బెటరో అది ఎంచుకోండి.

నార్మల్ స్కిన్ టైప్

సాధారణ చర్మ రకం కలిగి ఉండటం మంచి విషయంగా భావిస్తుంటారు. ఎందుకంటే.. ఇలాంటి చర్మంపై డ్రై ఏరియాస్‌ గానీ, ఆయిలీ ఏరియాస్ గానీ ఉండవు. మీ స్కిన్ మొటిమలు లేదా సెన్సిటివిటీస్‌కు గురయ్యే అవకాశం తక్కువ. ఇక సంరక్షణ విషయానికి వస్తే దీనికి బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అవసరం. ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం, రాత్రిపూట మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం వంటివి చేస్తే సరిపోతుంది.

సెన్సిటివ్ స్కిన్ టైప్

సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉన్నవారు ఫేస్‌ కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ రకాలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ సందర్భంలో మీకు అంతర్లీనంగా తామర, రొసేసియా లేదా అలెర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటివి ఉంటే మరింత కేర్ తీసుకోవాలి. ఎంతకైనా మంచిది డెర్మటాలజిస్టులను సంప్రదించాలి. సున్నితమైన చర్మ రకం కొన్నిసార్లు పొడిగా, మరి కొన్నిసార్లు జిడ్డుగా, ఇంకొన్నిసార్లు కాంబినేషన్‌గానూ ఉండవచ్చు. సంరక్షణ విషయానికి వస్తే రంగులు, సువాసనలు, బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా సాలిసిలిక్ యాసిడ్ వంటి కఠినమైన పదార్థాలతో కూడిన ఉత్పత్తులను నివారించాలి.

మిమ్మల్ని మీరు నమ్మండి

కొందరు తమ స్కిన్ టైప్ గురించి ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో చర్మ సంరక్షణకు సంబంధించిన రకరకాల కంటెంట్, స్కిన్ కేర్ రొటీన్స్ చూస్తున్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అవసరమైన ప్రొడక్ట్స్ ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అనుమాన పడుతుంటారు. అయితే మీ స్కిన్ కలర్ ఏదైనా, దాని రకం గురించి తెలిసి ఉన్నప్పుడు, మీ స్కిన్ మీద మీకు ప్రేమ, శ్రద్ధ ఉన్నప్పుడు ఆందోళన అవసరం లేదు. ఎలా ఉండాలో, ఎలా సంరక్షించుకోవాలో అనే విషయంలో ఆత్మ విశ్వాసంతో ఉండండి. కాబట్టి క్వాలిటీ స్లీప్, హైడ్రేషన్, వ్యాయామం, స్ట్రెస్ మేనేజ్ మెంట్ వంటి అంశాలు మీ స్కిన్ టైప్ అండ్ ఓవరాల్ స్కిన్ హెల్త్‌ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి అందుకు అనుగుణంగా జీవన శైలిని అలవర్చుకోండి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Heart Health: శీతాకాలంలో గుండె‌ ఆరోగ్యంగా ఉండాలా..? ఈ రెడ్ ఫుడ్స్ తినండి చాలు!





Advertisement

Next Story