పీడ కలలు.. పార్కిన్సన్స్ వ్యాధికి సంకేతాలు!

by Manoj |
పీడ కలలు.. పార్కిన్సన్స్ వ్యాధికి సంకేతాలు!
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజు రాత్రిపూట నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు ఎవరైనా సరే కలతలు లేని ప్రశాంతమైన నిద్ర పొందాలనుకుంటారు లేదా అందమైన కలలు కనాలని ఆశిస్తారు. కానీ ఒక్కోసారి మెదడు సృష్టించిన వర్చువల్ ప్రపంచంలో చెడు లేదా పీడకలలు తారసపడి కలవరానికి గురిచేస్తాయి. అయితే ఇలాంటి కలలు వారానికోసారి లేదా ప్రతీ రాత్రి పలకరిస్తుంటే అది పార్కిన్సన్స్ వ్యాధి ఆగమనాన్ని సూచిస్తున్నట్లేనని నిపుణులు సూచిస్తున్నారు.

eClinicalMedicineలో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం చెడు కలలు కంటున్న వృద్ధుల సమూహాన్ని పార్కిన్సన్స్‌తో బాధపడని వారితో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు సాధారణ పెద్దల కంటే ఎక్కువగా పీడకలలు, చెడు కలలను అనుభవిస్తారని మునుపటి అధ్యయనాలు పేర్కొన్నప్పటికీ పీడకలలను పార్కిన్సన్స్ ప్రమాద సూచికగా పరిగణించడం ఇదే మొదటిసారి.

పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి?

ఇది అత్యంత సాధారణ న్యూరోడీజెనరేటివ్, మూమెంట్ డిజార్డర్స్‌లో ఒకటి. దీనివల్ల కండరాల వ్యవస్థ నియంత్రణ కోల్పోతుంది. ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా అభివృద్ధి చెందినపుడు సాధారణంగా ఒక చేతిలో గుర్తించదగిన వణుకు ప్రారంభమవుతుంది. వణుకు సర్వసాధారణంగా ఉన్నప్పటికీ పార్కిన్సన్స్ వ్యాధి వల్ల కండరాల దృఢత్వం లేదా కదలికలు మందగిస్తాయి. చివరకు మాటల్లో తడబాటు మొదలై అస్పష్టంగా మారుతాయి. అందుకే వృద్ధాప్యంలో కలల్లో మార్పులు ఎదుర్కొంటుంటే.. మరో అనుమానం లేకుండా వెంటనే ఆరోగ్య నిపుణుడి సాయం తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed