- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గర్భ నిరోధక మాత్రల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్.. ఏం చేయాలో తెలుసా?
దిశ, ఫీచర్స్ : వెంటనే సంతానం వద్దనుకునే మహిళలకు బెస్ట్ మెడికల్ అడ్వాన్స్ మెంట్స్‌లో ఒకటి గర్భనిరోధక మాత్రల వాడకం. అన్ వాంటెండ్ ప్రెగ్నెన్సీ కోసం వీటిని వాడుతుంటారు. అయితే కొందరు వీటివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఎప్పుడో ఒకటీ రెండుసార్లు అయితే పర్లేదు. కానీ తరచుగా వాడకం అనేది అనారోగ్యాలకు దారితీస్తుంది. మచ్చలు, వికారం, రొమ్ములలో నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయని, చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ రెండు మూడు నెలల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
డిప్రెషన్
గర్భనిరోధక మాత్రలు వాడటంవల్ల యుక్త వయస్కులైన మహిళల్లో వారి ఆరోగ్య పరిస్థితి, హార్మోన్ల స్వభావాన్ని బట్టి డిప్రెషన్‌కు దారితీయవచ్చు. ఒకవేళ బాధితులు అంతకుముందు యాంటిడిప్రెసెంట్ వాడి ఉండటం లేదా మొదటి సారిగా డిప్రెషన్ నిర్ధారణ అయి ఉన్నా కూడా గర్భనిరోధకాలను ఉపయోగించడం తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తుంది.
మచ్చలు, బరువు పెరగడం
బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడంవల్ల తలెత్తే అత్యంత విలక్షణమైన ప్రతికూల ప్రభావం మచ్చలు. స్పాటింగ్ అనేవి రుతు కాలాల మధ్య జరిగే యోని రక్తస్రావంగా నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్ డిశ్చార్జ్ లేదా మైనర్ బ్లీడింగ్ వంటి సమస్యలు ఎదురు కావచ్చు. ఎటువంటి పరిశోధనలో నిర్ధారణ కానప్పటికీ బరువు పెరుగుతారని అనేకమంది అనుభవాల ద్వారా జాబితా చేయబడిందని నిపుణులు పేర్కొ్ంటున్నారు. దీంతోపాటు తేలికైన పీరియడ్స్ లేదా మిస్ పీరియడ్స్ సమస్యలు ఎదురవుతాయి.
కంటి సమస్యలు, రక్తం గడ్డ కట్టడం
కొన్ని అధ్యయనాల ప్రకారం.. కంటిలోని కార్నియా గట్టిపడటం అనేది గర్భ నిరోధక మాత్రల వాడకంతో ముడిపడి ఉంది. ఇది తీవ్రమైన కంటి సమస్యలకు దారితీయకపోవచ్చు కానీ కాంటాక్ట్ లెన్స్‌లు ఇకపై సున్నితంగా సరిపోవడం లేదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక ఆఫీస్ ఆన్ ఉమెన్స్ హెల్త్ స్టడీ ప్రకారం.. గర్భనిరోధక మాత్రలతో బ్లడ్ క్లాట్ అవడం, హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ రావచ్చు. లంగ్స్‌లో రక్తం గడ్డకట్టడంవల్ల కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. ఈ నెగెటివ్ ఎఫెక్ట్స్ అసాధారణమైనవే అయినప్పటికీ తీవ్రంగా ఉంటాయి. అందుకే గర్భ నిరోధక మాత్రలు వాడేముందు వైద్య నిపుణుల సలహాలు తప్పనిసరి పాటించాలని నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read: మీకు 40 ఏళ్లు దాటాయా.. అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే?