- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heart Health: శీతాకాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలా..? ఈ రెడ్ ఫుడ్స్ తినండి చాలు!
దిశ, ఫీచర్స్: చలికాలంలో పొడి వాతావరణం కారణంగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొంతు, జలుబు, దగ్గు, శ్వాసకోశ వంటి సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. దీంతో పాటుగా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. శీతాకాలంలో గుండెపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో శరీరంపై చల్లటి వాతావరణం ఎఫెక్ట్ పడుతుంది. శరీరానికి తగినం రక్తం సరఫరా చేసేందుకు, శరీరం లోపల వెచ్చగా ఉంచడంలో గుండె పని ఎక్కువగా ఉంటుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాలు మూసుకుపోయి గుండె, మెదడుకు వెళ్లే ధమనులను అడ్డుకుంటుంది. దీని వల్ల హార్ట్‌ఎటాక్ వస్తుంది. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో గుండెపోటు రేటు 53 శాతానికి పెరిగిందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ చేసిన అధ్యయనంలో తేలింది. చల్లటి వాతావరణం గుండెకు ప్రమాదమని నిపుణులు తెలిపారు. ఇలాంటి సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ ఫుడ్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చదివేయండి.
దానిమ్మ: దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధమనుల్లో బ్లాక్స్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
క్రాన్ బెర్రీస్: క్రాన్ బెర్రీస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సీడెంట్, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
రెడ్ యాపిల్: రెడ్ యాపిల్‌లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ 2 యాపిల్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ శాతం 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సీడెంట్లుగా పనిచేసే ఫ్లవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
దుంపలు: దుంపల్లో విటమిన్లు, యాంటీఆక్సీడెంట్లు, మినరల్స్, నైట్రేట్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె కండరాలను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి.
రెడ్ క్యాబేజీ: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు రెడ్ క్యాబేజీ మేలు చేస్తుంది. ఇది గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ - సి, కె, యాంటీఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను అదుపు చేయడంలో సహాయపడతాయి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Beetroot: ఎక్కువగా బీట్ రూట్ తింటున్నారా..? ఈ సమస్యలు వచ్చే చాన్స్!