రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా.. ఎలా నడిస్తే మంచిదో తెలుసా..

by Sumithra |
రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా.. ఎలా నడిస్తే మంచిదో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్ చేస్తుంటారు. అలాగే రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే రాత్రి భోజనం తర్వాత వేగంగా నడవాలా లేదా నెమ్మదిగా నడవాలా అనే చాలామంది మదిలో మెదిలే ప్రశ్న.

రాత్రిపూట చాలామంది తరచుగా చూస్తూ ఉంటాం. రాత్రి భోజనం తర్వాత కొంత సమయం పాటు చల్లగాలికి నడిచి ఆ తర్వాత మెళ్లిగా పడుకుంటారు. అయితే ఆహారం తిన్నాక నేరుగా పడుకునే వారు కొందరున్నారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత జీర్ణ సమస్యలు రావచ్చు. ఈ సమస్యను నివారించడానికి ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా నడవాలి. అయితే మీరు ఎంతసేపు, ఏ వేగంతో నడవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి 7 గంటలకే డిన్నర్‌ చేయాలని పలువురు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనం చేసిన వెంటనే వాకింగ్‌కి వెళ్లకండి. తిన్న తర్వాత కనీసం గంట సేపు గ్యాప్ ఇవ్వాలంటున్నారు. అలాగే రాత్రిపూట స్పీడ్ గా కాకుండా వీలైనంత నెమ్మదిగా నడవండి. రాత్రి భోజనం తర్వాత అరగంట నుంచి గంట వరకు సాధారణంగా నడవాలంటున్నారు. అలా కాకుండా వేగంగా నడవడం వల్ల కడుపులో నొప్పి వస్తుందట.

రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు..

1. సులభంగా ఆహారం జీర్ణం..

రాత్రి భోజనం చేసిన తర్వాత అరగంట పాటు నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావు.

2. మెటబాలిజం బూస్ట్..

రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. మీ బరువును అదుపులో ఉంచుతుంది.

3. రోగనిరోధక శక్తి..

రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసే అలవాటు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ద్వారా అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందుతారు. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవాలి.

4. ప్రశాంతమైన నిద్ర..

నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, దీని వలన మంచి నిద్ర వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed