వారానికి ఇన్నిసార్లు SEX చేస్తే కరోనా కూడా లైట్‌.. స్ట‌డీలో వెల్ల‌డి

by Sumithra |   ( Updated:2022-08-25 11:06:31.0  )
వారానికి ఇన్నిసార్లు SEX చేస్తే కరోనా కూడా లైట్‌.. స్ట‌డీలో వెల్ల‌డి
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సెక్స్ అనేది జీవితంలో కామ కోరిక‌ల‌ను తీర్చుకునే ప్ర‌య‌త్నం మాత్ర‌మే అనుకుంటే పొర‌పాటే. సెక్స్ మ‌నిషికి మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యంలో ఎంతో తోడ్పాటును అందిస్తుంది. కానీ, ఆ స‌మ‌యంలో భాగ‌స్వాములిద్ద‌రి స‌మ్మ‌త‌ముంటేనే దేహంలో ఆరోగ్య‌క‌ర మార్పులు సంభ‌విస్తాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అయితే, వారంలో ఎన్నిసార్లు సెక్స్ చేస్తే ఆరోగ్యంలో ఎలాంటి మార్పు వ‌స్తుంద‌నే విష‌యంలో అధ్య‌య‌నాలు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాయి. ఇందులో భాగంగా, సెక్స్ చేయ‌డం వ‌ల్ల‌ క‌రోనా వైర‌స్ సోకినా దాని ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉంటుంద‌ని స్ట‌డీలో వెల్ల‌డించారు.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం విభాగంలో ప్రొఫెసర్ అయిన‌ కేయ్ వెల్లింగ్స్ దీనికి సంబంధిచిన విశేషాల‌ను వెల్ల‌డించారు. సైకలాజికల్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన 2004లోని ఓ అధ్యయనం ప్ర‌కారం, వారానికి ఒకటి లేదా రెండుసార్లు సంభోగం చేయడం వల్ల ఇమ్యునోగ్లోబులిన్ A స్థాయిలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షించే రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీ ప్రతిస్పందనలో భాగమ‌ని తెలిపారు. దీనితో పాటు, జర్నల్ ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ కూడా, నెలకు కనీసం మూడు సార్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి కోవిడ్-19 సంక్రమించినా తేలికపాటి ప్ర‌భావం మాత్ర‌మే ఉంటుంద‌ని వెల్లడించింది.

హాలీవుడ్ వెబ్ సిరీస్.. సమంతకు మరో బంపర్ ఆఫర్!

Advertisement

Next Story

Most Viewed