- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్ ప్లాంట్ కండెన్సర్ కోటింగ్‌ను కనుగొన్న సైంటిస్టులు.. పర్యావరణంలో CO2ను తగ్గిస్తుందట
దిశ, ఫీచర్స్: శిలాజ ఇంధనాలను కాల్చడం పర్యావరణానికి హాని చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే ప్రత్యామ్నాయాలపై సైంటిస్టులు ఫోకస్ చేస్తున్నారు. పొల్యూషన్ లేని సమర్థవంతమైన ఎనర్జీ జనరేషన్ మార్గాలను వెతుకుతున్నారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్‌లోని శాస్త్రవేత్తలు ఆవిరి కండెన్సర్ పైపుల కోసం ఒక న్యూ కోటింగ్ మెథడ్‌ను డెవలప్ చేశారు. దీనిని విస్తృతంగా తయారు చేస్తే వరల్డ్ వైడ్‌గా విలువైన అదనపు శక్తిని ఆదా చేయవచ్చని పేర్కొంటున్నారు.
అనేక రకాల పవర్ జనరేషన్స్ ఆవిరి చక్రంలో పని చేస్తాయి. ముఖ్యంగా శక్తి వనరులు శిలాజ ఇంధనాలను కాల్చడం లేదా అణు విచ్ఛిత్తి ద్వారా ఆవిరిని ఉత్పత్తి చేయడానికి, బాయిలర్‌లో నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి టర్బైన్ను తిప్పడానికి పంపబడుతాయి. తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. చక్రాన్ని కొనసాగించడానికి నీటిని తిరిగి పొందేందుకు ఆవిరిని కండెన్సర్‌లో సేకరిస్తారు. అయితే కొత్త అధ్యయనం ప్రకారం పరిశోధకులు కండెన్సర్ పైపుల హీట్ ట్రాన్స్ఫర్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే పద్ధతిని కనుగొన్నారు.
వారు ఫ్లోరినేటెడ్ డైమండ్ లాంటి కార్బన్ (F-DLC), హైడ్రోఫోబిక్ను తిప్పికొట్టే పదార్థంతో తయారు చేసిన పూతను డెవలప్ చేశారు. ఈ కోటింగ్‌తో కూడిన పైపులపై ఆవిరి ఘనీభవించినప్పుడు, ఇకపై ఒక సన్నని పొరను ఏర్పరచదు. పైగా వేగవంతమైన పొల్యూషన్ లేని పవర్ జనరేషన్‌కు దోహదపడుతుంది. భవిష్యత్తులో ఈ కండెన్సర కోటింగ్ విధానాన్ని విస్తరించడం ద్వారా వరల్డ్ వైడ్‌గా కర్బన ఉద్గారాలు సంవత్సరానికి 460 మిలియన్ టన్నులు తగ్గుతాయని, 2 ట్రిలియన్ గ్యాలన్ల శీతలీకరణ నీరు ఆదా అవుతుందని, అదనంగా 1,000 TWh విద్యుత్ ఉత్పత్తి అవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు.