- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
End of era : ఈ భూమిపై ఎవ్వరూ మిగలరు?.. భవిష్యత్‌లో జరిగేది ఇదే!

దిశ, ఫీచర్స్ : భూమిపై ఆక్సిజన్ తగ్గుతోందా? సుదీర్ఘ భవిష్యత్‌లో అది జీవం అంతరించనుందా? మానవాళికి ప్రమాదం పొంచి ఉందా? అవును ఓ సూపర్ కంప్యూటర్ దీని గురించి అంచనా వేస్తోందిప్పుడు. భూమిపై ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశాలపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇలాంటి ప్రమాదం లేకపోయినా మిలియన్ సంవత్సరాల తర్వాత ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల, భూగోళం వేడెక్కడం, అగ్ని పర్వతాల విస్పోటనాలు వంటివి అధికమై మానవులతో సహా క్షీరదాలను అంతరించిపోయేలా చేస్తాయని ఒక కొత్త సిమ్యులేషన్ (simulation) అంచనా వేస్తోంది. దీని ప్రకారం.. 250 బిలియన్ సంవత్సరాల తర్వాత భూ గ్రహం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చునని, భరించలేని వేడితో జీవజాలం నశించిపోవచ్చునని అంచనా వేస్తున్నారు పరిశోధకులు.
బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో భాగంగా సిమ్యులేషన్(simulation) అంచనాలను బట్టి 250 మిలిన్ సంవత్సరాల తర్వాత భూమిమీద ఆక్సిజన్ కొరత భారీగా ఏర్పడుతుంది. అంతేకాకుండా భూమి మీద భూ భాగాలు విలీనం అవుతాయని, పాంగేయా అల్టిమా (Pangaea Ultima) అనే కొత్త కారణంగా ఒక సూపర్ ఖండం ఏర్పడుతుందని చెబుతున్నారు. అప్పుడు అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 50°C (122°F)కి చేరుకోవచ్చు. మహా సముద్రాలు క్షీణించవచ్చు. దీనివల్ల క్షీరదాల మనుగడ దాదాపు అసాధ్యం.
అగ్ని పర్వత కార్యకలాపాలు పెరుగడంవల్ల కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది గ్రీన్ హౌస్ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. సూర్యుడు ఇప్పటిలా కాకుండా మండే అగ్నిగోళంలా మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. అధిక ఉష్ణోగ్రతల నడుమ జీవరాశిలో, వాటి తేమ స్థాయిల్లో మార్పు వస్తుంది. అధిక చెమటలు రావడంతో పాటు క్షణాల్లో ఆవిరైపోవడంవల్ల క్షీరదాలు వేడెక్కుతాయి. 92 శాతం భూమి జనావాసాలకు పనికిరాకుండా పోతుందని అధ్యయనం అంచనా వేసింది. భూమి మీద ధ్రువ ప్రాంతాలు, కోస్టల్ ఏరియాలు (polar and coastal) మాత్రమే కొద్దిపాటి నివాసంగా ఉండవచ్చు.