వీడియో చూసి వర్క్ నేర్చుకుంటున్న రోబోట్స్.. ఎలా అంటే

by Hamsa |   ( Updated:2023-06-22 12:14:01.0  )
వీడియో చూసి వర్క్ నేర్చుకుంటున్న రోబోట్స్.. ఎలా అంటే
X

దిశ, ఫీచర్స్: రోబోట్స్ గురించి తెలిసినప్పటికీ ప్రస్తుతం మానవ అవసరాలకు వాటి వినియోగం చాలా అరుదుగానే ఉంటోంది. ఎందుకంటే మానవ అవసరాలకు సబంధించిన అన్ని పనులూ చేయలేవు. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. మనుషుల్లాగే రోబోట్స్ కూడా చాలా పనులు చేయవచ్చని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చెప్తున్నారు. వీరు రోజువారీ ఇంటి పనులను నిర్వహించే మెషిన్ల తయారీలో నిమగ్నమయ్యారు. ‘హౌ టు వీడియో’లను చూడటం ద్వారా తాము రూపొందించే రోబోట్స్ పనిచేసే విధానాన్ని పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అమరికలు కలిగిన ఈ రోబోట్స్ ఇల్లు సర్దడం, స్టవ్ పై నుంచి పాత్రలను తీసి పక్కన పెట్టడం, డోర్లు ఓపెన్ చేయడం, ఇండ్లు తుడవడం, ఇంటికి వచ్చే కొత్త వ్యక్తులకు వెల్కమ్ చెప్పడం వంటి స్కిల్స్‌ను ప్రదర్శించాయి.

అంతేగాక అవి విజన్ రోబోటిక్ బ్రిజ్జ్ (VRB) టెక్నాలజీ ఆధారంగా మానవ ప్రవర్తనను చూసి నేర్చుకోవడం, అలవర్చుకోవడం చేస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఉదాహరణకు ఒక మనిషి డోర్ తీస్తున్న ఒక వీడియోను రోబట్ చూసినప్పుడు, అందులో అమర్చబడిన టెక్నాలజీ బేసిక్ పాయింట్స నుంచి నేరుగా కాంటాక్ట్ పాయింట్స్ వరకు హ్యాండిల్ చేసే తీరును, కదలికలను అది గ్రహిస్తుంది. దీనివల్ల సదరు రోబోట్ కూడా మనిషి మాదిరిగా డోర్ తీసే పనిని నేర్చుకుంటుంది. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తాము రూపొందించే రోబోట్స్ మానవులకు వంట చేయడం నుంచి శుభ్రపరచడం వరకు అన్ని పనుల్లో సహాయపడతాయని మరో పరిశోధకుడు, సీఎంయూ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్‌కు చెందిన రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దీపక్ పాఠక్ తెలిపారు. .

Also Read..

తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని పనులు.. తప్పక తెలుసుకోండి

Advertisement

Next Story

Most Viewed