Brain - Creativity: క్రియేటివిటీ బ్రెయిన్‌లో ఏ ప్రాంతంలో ఉద్భవిస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు...

by Sujitha Rachapalli |
Brain - Creativity: క్రియేటివిటీ బ్రెయిన్‌లో ఏ ప్రాంతంలో ఉద్భవిస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు...
X

దిశ, ఫీచర్స్: క్రియేటివ్ గా ఆలోచించినప్పుడు మన బ్రెయిన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తెలుసుకునేందుకు Utah Health University, Baylor College Of Medicine సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి. అడ్వాన్స్డ్ బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నిక్ ఉపయోగించి.. ఎట్టకేలకు సృజనాత్మకత మెదడులో ఎక్కడ ఉద్భవిస్తుందో కనిపెట్టారు. బ్రెయిన్ రీజియన్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో వివరించారు. ముఖ్యంగా క్రియేటివ్ థాట్ టైంలో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్(DMN) ఏ విధంగా కొలాబొరేట్ అవుతుందో చెప్పారు.

DMN అనేది మెడిటేషన్, డే డ్రీమింగ్ టైంలో యాక్టివేట్ అవుతుంది. సమస్యను పరిష్కరించేటప్పుడు ఇతర మెదడు ప్రాంతాలు ఇన్వాల్వ్ కాక ముందే క్రియేటివ్ థింకింగ్ ను ఇనిషియేట్ చేస్తుంది. ఎపిలెప్సీ మానిటరింగ్ కు ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసిన సైంటిస్టులు... క్రియేటివ్ టాస్క్ సమయంలో రియల్ టైం బ్రెయిన్ యాక్టివిటీ క్యాప్చర్ చేశారు. క్రియేటివిటీ విషయాల్లో DMN రోల్ అర్థం చేసుకోవడం ద్వారా మానసిక అనారోగ్య చికిత్సలను కనిపెట్టడంలో సహాయం చేస్తుందని.. బ్రెయిన్ రీజియన్స్ లో క్రియేటివిటీ బూస్ట్ చేసేందుకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed