చంద్రుడిపై పుట్టగొడుగులతో ఇల్లు.. నిర్మించేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నం

by Mahesh |   ( Updated:2023-02-04 10:49:27.0  )
చంద్రుడిపై పుట్టగొడుగులతో ఇల్లు.. నిర్మించేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నం
X

దిశ, ఫీచర్స్: భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపై మనుషులు పుట్టగొడుగులతో నిర్మితమైన ఇండ్లల్లో నివసించే అవకాశాలు లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుందనేందుకు అనేక సాంకేతికత ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం భూమిపై మనం చూసే పుట్టగొడుగులు ఆహారం రూపంలో మనుషులకు ఉపయోగపడుతున్నాయి. కానీ భవిష్యత్తులో మాత్రం వీటిలో ఉండే పదార్థం, ఆకారం చంద్రమండలంపై మానవుడి నివాసానికి ఉపయోగపడవచ్చని అంటున్నారు.

ఈ క్రమంలోనే అమెరికన్ ఆర్కిటెక్చర్ సంస్థ రెడ్ హౌస్, నాసా మాసాచుట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ బ్రిటిష్ అండ్ అటామస్ సంయుక్తంగా.. స్పేస్‌లో నివాసయోగ్యమైన బయో హాబిటేటస్ హోమ్స్ నిర్మించే దిశగా ప్రయోగాలు, ప్రయత్నాలు ప్రారంభించింది.

రెడ్ హౌస్ సంస్థ నమీబియాలోని ఎన్‌క్రాచర్ బుష్ నుంచి నిరుపయోగమైన ఒక వ్యర్థ జీవ పదార్థాన్ని మిక్స్ చేస్తోంది. ఇది భూగర్భజలాలను హరించి, సారవంతమైన ప్రాంతాలను ఎడారులుగా మార్చే మైసీలియం లేదా ఫంగస్. దీని నిర్మాణం ఫైబర్స్‌ను అనుసంధానించే అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌గా ఉంటుంది. కాంక్రీట్ కంటే బలమైన నిర్మాణంతో ఉండే ఈ మైసీలియం ముఖ్యలక్ష్యం ఆహారాన్ని తయారుచేసుకోవడమే. కాగా ఇది జిగురు లాంటి పదార్థమని, నిర్మాణపు వస్తువులు ఒక దానికి ఒకటి అతుక్కునేలా పనిచేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

అంగారకుడిపై ఇళ్లు ఎలా నిర్మిస్తారు?

అంతరిక్షంలో బయోమాస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దీని సాధ్యాసధ్యాల గురించి సైంటిస్టులు నాసా కేంద్రంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే అంగారకుడిపై జీవరాశి లేదు. అలాంటప్పుడు భూమిపై ఉన్న వ్యర్థ ప్రదార్థాల(సముద్రపు నాచు, లేదా మైసీలియం పదార్థం) సాయంతో హోమ్ డిజైన్ తయారుచేసి, అంగారక గ్రహంపైకి పంపవచ్చనే ఆలోచన చేస్తున్నారు. దీంతోపాటు మార్స్ ఉపరితలంపై రోవర్ వాహనం ఆల్గేను రీహైడ్రేట్ చేయడానికి రెడ్ ప్లానెట్ నుంచి సేకరించిన కార్బన్ డై యాక్సైడ్, నైట్రోజన్, నీటిని సీల్ చేసిన బ్యాగ్‌లోకి ఇంజెక్ట్ చేస్తుంది.

ఒక విధంగా చెప్పాలంటే ఇది బెలూన్‌ను గాలితో నింపడం లాంటి ప్రక్రియను పోలి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. ఇలా చేయడంవల్ల అది అక్కడ ప్రతిచర్యగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. నిర్మాణానికి అవసరమైన మైసీలియంను పెంచుతుంది. ఆ విధంగా కావలసిన నిర్మాణ ఆకృతికి విస్తరిస్తుంది. దీనివల్ల అక్కడ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కూడా త్వరగా జరుగుతుంది. కలలుగన్న నిర్మాణ ఆకృతి కొన్ని గంటల సమయంలోనే సాధ్యం అవుతుంది. అప్పుడు ఇన్సులేటింగ్‌గా మారే ఘన, పొడి బయో మెటీరియల్‌ను నాలుగు వారాల్లో అంటే నెలరోజుల్లో పూర్తి చేయవచ్చు.

కాంక్రీట్, రేడియేషన్

ఫంగస్ సంబంధిత జీవపదార్థం భూమిని చాలా చిన్న ద్రవ్యరాశిగా మార్చగల సామర్థ్యం కలది. అది గమ్యస్థానంలో టన్నుల పదార్థంగా మారుతుంది. కానీ ఇది అధిక శక్తి రేడియేషన్‌ను మార్చగలదు(రేడియేషన్ అనేది అంగారక గ్రహానికి వెళ్ళకుండా నిరోధించే ప్రధానమైన చర్య). ఎక్కువ స్థాయిల రేడియేషన్ నుంచి రక్షితమైన పొరగా పనిచేయడానికి మైసీలియం సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఈ క్రమంలో ప్రాజెక్టు బృందం స్థూలంగా అక్కడ ఒక జీవిని క్రియేట్ చేస్తోంది. సూక్ష్మజీవుల కోసం నిర్మాణాన్ని రూపొందిస్తోంది. పుట్టగొడుగులు నిజంగా ఇంటిని తయారు చేయగలవా? అన్నప్పుడు నాసాకు చెందిన నిపుణులు తామిప్పటికీ ఈ విషయంపై ఆలోచించామని, ఐడియా బాగానే ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మైసీలియం(దారపు పోగుల ఆకృతి గల శిలీంద్రం) ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.

చంద్రుడిపై కాలనీలు

మనం పుట్టగొడుగుల్లాంటి నివాసాలు చంద్రుడిపై, అంగారకుడిపై సాధ్యం అవుతుందా లేదా పరిశీలించాల్సి ఉంది. అందుకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కానీ అందుకు అయ్యే ఖర్చును భరించి ప్రయోగాలు చేయగలిగితే కొన్నేళ్ల తర్వాతనైనా సాధ్యం చేయగలమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మన దగ్గర చాలా మెటీరియల్ ఉంది. ఇప్పటికే రెడ్ హౌస్, నాసా ఇన్నోవేటివ్ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌లలో కాన్సెప్ట్ ఫేజ్ రుజువును ఆమోదించింది.

ప్రస్తుతం రెండవ దశలో ఉంది(ఆర్కిటెక్చరల్ డిజైన్ డెవలప్‌మెంట్). మూడవ దశ కూడా సాధ్యం అవుతుంది. అయితే ఆర్కిటెక్చర్ సంస్థ నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్‌ను ఉపయోగించి చంద్రునికి దాని నమూనాను చిన్న సైజులో 15..15 సెం.మీ పంపడానికి సిద్ధమవుతోంది. ఇది ప్రైవేటు కంపెనీలు చంద్రుని ఉపరితలంపై దిగడానికి సైంటిఫిక్ పరికరాలను తీసుకురాగల సహాయాన్ని అందిస్తుంది.అంతేకాదు చంద్రుడిపై శిలీంధ్రాలను పోషించే ఆక్సిజన్‌ను సృష్టించి, సుదీర్ఘకాలం తర్వాతనైనా అక్కడ నీటి లభ్యత గురించి నాసా ఆలోచిస్తోంది. అయితే పుట్టగొడుగుల మాదిరి ఆర్కిటెక్చర్ విధానం అక్కడ సాధ్యమా అన్నప్పుడు కావచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎందుకంటే అది కార్బన్ డై యాక్సైడ్‌ను విడుదల చేసే బదులు నిల్వ చేయడం లాంటిది.

రీన్‌ఫోర్డ్స్ కాంక్రీటు నిర్మాణాల ప్రక్రియను, నిర్మించే విధానాన్ని మార్చిన విధంగానే ఆధునిక సాంకేతికతతో కార్బన్‌ ను కూడా చంద్రుడిపైకి పంపి స్టోర్ చేయగలిగితే, అక్కడి వాతావరణంలో కార్బన్‌ను ఉంచే విధానం ద్వారా శీలీంద్రాల సృష్టితో భవిష్యత్తులో నిర్మాణాలు సాధ్యం అవుతాయి.

READ MORE

ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలేవో తెలుసా !

ఈ ఒక్క స్టోరీ చదవండి చాలు... సక్సెస్ మీ ఇంటి తలుపులు తడుతుంది!


Advertisement

Next Story

Most Viewed