శివరాత్రికి ముందు మీ కలలో ఇవి కనిపిస్తే ఎంత మంచిదో తెలుసా?

by samatah |   ( Updated:2023-02-14 04:29:58.0  )
శివరాత్రికి ముందు మీ కలలో ఇవి కనిపిస్తే ఎంత మంచిదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కలలు రావడం అనేది సహజం. అయితే కొన్ని ప్రత్యేక రోజుల ముందు మంచి కలలు వస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయంట. అయితే ఇప్పుడు శివరాత్రి వస్తుంది. ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఈ పర్వదినం ముందు మీ కలలకో ఇవి కనిపిస్తే చాలా మంచిదంట. అంతే కాకుండా రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

శివరాత్రి ముందు నల్ల శివలింగం కలలో కనిపిస్తే చాలా మంచిదంట. ఇలా కనిపించడం వలన మీరు చేసే పనిలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందంట.

రుద్రక్షలు ఎంత పవిత్రమైనవో తెలిసిందే. అంతే కాకుండా శివుడికి చాలా ఇష్టం. అయితే శివ రాత్రి రోజు కలలో రుద్రాక్ష కనిపిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయంట.

మహాశివరాత్రికి ముందు మీ కలలో పాము కాని పాము పుట్ట కాని కనిపించినట్లయితే అది మీకు సంపదకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి : దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్లిపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Advertisement

Next Story