- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అట్రాక్టివ్ రియాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్.. పోస్టులు వైరల్‌గా మారడంపై నిపుణుల పరిశోధన

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం యూత్‌నే కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ఎఫెక్టివ్ ట్రెండింగ్ కమ్యూనికేటర్ ఏదైనా ఉందంటే.. అది సోషల్ మీడియా అనే చెప్పాలి. ఇందులో చాలామంది పంచుకునే స్టోరీస్, కంటెంట్, ఆర్టికల్స్ కొన్ని సందర్భాల్లో వైరల్ అవుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో వైరల్ అవ్వకపోయినా ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంటాయి. ఇంకొన్ని సదర్భాల్లో ఎక్కువ వ్యూస్, లైక్స్, షేరింగ్స్ సంపాదించుకుంటాయి. వ్యక్తులకు, సంస్థలకు మంచి గుర్తింపును తెస్తుంటాయి. అందుకే వ్యక్తిగత అంశాలు మొదలు ఆర్థిక, సామాజిక, వ్యాపార, రాజకీయ, ఆరోగ్య, సాంస్కృతిక, ఇంకా అనేక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి నేడు చాలామంది ఆశ్రయిస్తున్న ఆధునిక ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా. అయితే కొన్ని పోస్టులు ఎందుకు వైరల్ కావు? మరికొన్ని పోస్టులు సోషల్ మీడియా ల్యాండ్ స్కేప్‌ను ఎందుకు ఆసక్తిగా మారుస్తుంటాయి? అనే సందేహాలు అనేకమందిని వెంటాడుతుంటాయి. అందుకు సమాధానం కోసం మరెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. అది మీ మైండ్‌లోనే ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొన్నది.
‘బ్రెయిన్ యాక్టివిటీస్’ కీ రోల్
ఒక పోస్టులు ఎందుకు వైరల్‌గా మారుతుందో తెలుసుకోవడానికి 2022లో పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన అన్నెన్‌బర్గ్ స్కూల్ ఫర్ కమ్యూనికేషన్ విభాగంలోని న్యూరోసైన్స్ ల్యాబ్ నిపుణులు పరిశోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు అనేక ఆసక్తి కరమైన విషయాలను కనుగొన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్ తమకు పర్సనల్ ఫీల్ కలిగించే వాటిని, తమకు అనుకూలంగా భావించే సమాచారం కలిగి ఉన్నవాటిని మాత్రమే ఎక్కువగా షేర్ చేస్తారని గమనించారు. మరింత సరళంగా చెప్పాలంటే.. వ్యక్తులు తమకు లేదా తమ ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీకి రియల్ వాల్యూబుల్ కలిగిస్తుందనే కంటెంట్‌ను, పోస్టును పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారని పరిశోధకుల అబ్జర్వేషన్‌లో వెల్లడైంది. అయితే యూజర్ల ‘షేరింగ్ డిసిషన్’ అనేది పోస్టులు చూసినప్పుడు అవి ఆకట్టుకుంటే, సదరు వ్యక్తుల్లో వాటిని షేర్ చేసే బ్రెయిన్ యాక్టివిటీస్ పెరగడానికి దారితీస్తుందని లేటెస్ట్ రీసెర్చ్ స్పష్టం చేసింది.
పరిశోధన జరిగిందిలా..
అధ్యయనలో భాగంగా పరిశోధకులు న్యూ యార్క్ టైమ్స్ నుంచి ‘ఆరోగ్యకరమైన జీవనం’ గురించిన కథనాలను ప్రజలు షేర్ చేయడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (functional magnetic resonance imaging) ప్రాసెస్ ద్వారా పోస్టులు షేర్ చేసేవారి బ్రెయిన్ యాక్టివిటీస్‌ను ఎనలైజ్ చేశారు. అయితే ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(fMRI) స్కానర్ లోపల ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కథనాన్ని షేర్ చేయడం ఆలోచించాలని కూడా పరిశోధనలో పాల్గొన్న వాలంటీర్లను కోరారు. “ఎవరికైనా సహాయం చేయడం” (use the article to relate positively to others) లేదా “మిమ్మల్ని మీరు వివరించుకోవడం” (use the article to present yourself positively to others) అనే సాధ్యమయ్యే రెండు లక్ష్యాలను సూచించారు. మరికొందరికి తటస్థ సమాచారాన్ని(to spread information) వ్యాప్తి చేయాలనే గోల్ కేటాయించారు. ఈ సందర్భంగా "జీవితంలో అన్ని రంగాలలో(In all areas of life) ప్రజలు తమను తాము పాజిటివ్‌గా చూపించాలని లేదా ఇతరులతో సానుకూల సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటారని మేం గమనించాం’’ అని ప్రొఫెసర్ స్కోల్జ్ (Prof. Scholz) వెల్లడించారు.
ఆకట్టుకునే రియాలిటీ అవసరం
నిపుణుల పరిశీలనలో హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్‌ను చదివినవారు. దానికి సంబంధించిన హెడ్‌లైన్, సమ్మరీ చదివిన తర్వాత అది తమకు, తమ సమూహానికి, ఫ్రెండ్స్‌కు ప్రయోజనం చేకూర్చుతుందని ఫీలవ్వడంవల్ల లైక్ చేయడం, పంచుకోవడం చేశారని తేలింది. ఫైనల్లీ ప్రతీ వ్యక్తి నిజ జీవితంలో కథనాన్ని పంచుకునేందుకు అతనిని ఆకట్టుకునే ఏదో ఒక రియాలిటీని జోడించాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. మనం షేర్ చేసే పోస్టులు సెల్ఫ్ రిలేటెడ్ థింకింగ్, వాల్యూ-రిలేటెడ్ థింకింగ్, సోషల్ రిలేటెడ్ థింకింగ్ ఆలోచనలతో సంబంధం కలిగి ఉంటేనే అవి వైరల్ అయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఒక పోస్టు ఎక్కువ క్లిక్‌లను పొందాలంటే కేవలం అది భావోద్వేగంగా ఉందా లేదా అనే విషయం మాత్రమే ప్రాధానమైంది కాదు. అందులో యూజర్లను ఆకట్టుకోగలిగే పర్సనల్ ఫీల్ ఉన్నప్పుడే అది యూజర్ల బ్రెయిన్ యాక్టివిటీని మోటివేట్ చేసి, వైరల్ అయ్యేందుకు ప్రేరేపిస్తుంది.