Fragrances : సువాసనలు.. ఆ వ్యాధులనూ దూరం చేస్తాయ్!

by Javid Pasha |
Fragrances : సువాసనలు.. ఆ వ్యాధులనూ దూరం చేస్తాయ్!
X

దిశ, ఫీచర్స్ : గులాబీల గుబాళింపులు, మల్లెపూల పరిమళాలు, సెంటు వాసనలు.. స్మెల్ ఏదైతేనేం.. సువాసనలు మనలో ఆనందాన్ని కలిగించడమే కాదు, పలు వ్యాధులనూ దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మతిమరుపునకు దారితీసే అల్జీమర్స్, డెమన్షియా వంటి చిత్త వైకల్యాలను నివారిస్తాయని, మానసిక వికాసాన్నీ కలిగిస్తాయని కాలిఫోర్సియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

అధ్యయనంలో భాగంగా పలువురు న్యూరో సైంటిస్టులు సువాసనలు మనిషిని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించారు. గత అధ్యయనాలు కూడా డెమెన్షియా బాధితులు రోజుకు రెండు సార్లు 40 సువాసలనకు గురైనప్పుడు వారిలో జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలు మెరుగుపడినట్లు వెల్లడించాయి. కాగా తాజా అధ్యయనంలో పరిశోధకులు మరోసారి 60 నుంచి 85 సంవత్సరాల మధ్య వయసుగల 43 మందికి వారు డైలీ 80 రకాల సువాసనలను స్విప్ చేయాలని సూచించారు. ఇక ఈ సువాసనల్లో గులాబీ, నారింజ, యూకలిప్టస్, నిమ్మకాయ, పిప్పరమెంటు, రోజ్మేరీ అండ్ లావెండర్ సహా ఇంకెన్నె పువ్వులు, పదార్థాలు, పెర్ఫ్యూమ్‌లు ఉన్నాయి. ఈ సందర్భంగా పరిశోధకులు నాడీశాస్త్రపరంగా వాటి సువాసనలు డెమెన్షియా బాధితుల్లో, సాధారణ వ్యక్తుల్లో కూడా జ్ఞాపకాలను, మధురానుభూతులను ప్రేరేపించాయని, అల్జీమర్స్ బాధితుల్లో మతిమరుపును నివారించాయని గుర్తించారు. ఇక సీనియర్ సిటిజన్లు ప్రతి రాత్రి రెండు గంటల పాటు తమ బెడ్‌రూమ్‌లలో సువాసన డిఫ్యూజర్స్‌ను ఉపయోగించిన తర్వాత గతంకంటే వారి మెమోరీ పవర్‌.. అంటే ఆయా విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం పెరిగిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Next Story

Most Viewed