- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రెయిన్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తున్న వాకింగ్ .. తాజా అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : వాకింగ్ వల్ల ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, బ్రెయిన్ కనెక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయని.. వృద్ధులు, మానసిక రుగ్మతలు కలిగిన వారిలో జ్ఞాపశక్తి పెరగడానికి దోహదం చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ అరగటంట నడక శరీరానికి, మెదడుకు మధ్య ఉన్న నాడీ వ్యవస్థను ప్రేరేపించడం వల్ల ఇలా జరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగానికి చెందిన పరిశోధకులు చెప్తున్నారు. ఇందుకోసం వారు బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గాలేని వ్యక్తులను, మైల్డ్ కాగ్నెటివ్ డిజార్డర్‌తో బాధపడుతున్న వృద్ధులను స్టడీ చేశారు. అలాగే 71 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల 33 మందిని వారానికి నాలుగు రోజులు చొప్పున వ్యాయామానికి ముందు, తర్వాత వారి మెదడులో జరిగిన మార్పులను అంచనా వేశారు.
12 వారాల పాటు ట్రెడ్‌మిల్‌పై నడకను కొనసాగిస్తున్న వృద్ధులకు పరిశోధకులు రెగ్యులర్‌గా వాకింగ్ సమయాల్లో కొన్ని రోజులు, వాకింగ్ ఆపేసినప్పుడు కొన్నిరోజులు ఒక చిన్న కథను చదివి వినిపించారు. నడకకు ముందు, తర్వాత వినిపించిన కథను పునరావృతం చేయాలని కోరారు. అయితే రెగ్యులర్‌గా నడకను కొనసాగిస్తున్నవారు యాక్టివ్‌గా ఉండటంతోపాటు వారు తమకు పరిశోధకులు వినిపించిన స్టోరీని చక్కగా పునరావృతం చేయగలిగారు. అంటే వీరిలో జ్ఞాపశక్తి మెరుగు పడింది. ఇక వాకింగ్ లేదా వ్యాయామాలకు దూరంగా ఉంటున్న వృద్ధులు అంతకు ముందు పరిశోధకులు వినిపించిన కథను పునరావృతం చేయడంలో ఇబ్బంది పడ్డారు. చాలామంది తమకు గుర్తు లేదని చెప్పారు. వాకింగ్ లేదా వ్యాయామం లేకపోవడంవల్ల బ్రెయిన్ కనెక్టివిటీ ఇంప్రూవ్ మెంట్స్ మందగించడంవల్ల ఈ కోవకు చెందినవారిలో జ్ఞాపశక్తి మందగించిందని పరిశోధకులు గుర్తించారు. దీనిని బట్టి జ్ఞాపకశక్తి పెరగడానికి నడక దోహదం చేస్తుందని, అల్జీమర్స్‌ను నివారిస్తుందని నిర్ధారణకు వచ్చారు.
Read More... 30 రోజుల్లో మూడు సార్లు మరణించిన మహిళ.. ప్రముఖుల ఆత్మలతో కలిసిన ఆమె