- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Global Warming: ప్రపంచంలోనే అత్యంత తేలికైన పెయింట్.. గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తుందంటున్న పరిశోధకులు!
దిశ, ఫీచర్స్: మనం ప్రస్తుతం గోడలకు వేస్తున్న పెయింట్ అనేక కెమికల్స్‌తో మిక్స్ అయి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అంత పర్యావరణ హితమైనది కాదు. కానీ తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత తేలికైన, నాణ్యమైన పెయింట్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఉపయోగించే కెమికల్స్ పెయింట్‌కంటే ఇది అన్ని విధాలా పర్యావరణ హితమైనదేగాక నాణ్యమైనది. ఒక్కసారి వేస్తే దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా ఉంటుంది.
పరిశోధకుల ప్రకారం.. ఈ ప్లాస్మోనిక్ పెయింట్ పర్యావరణానికి ఎటువంటి ముప్పునూ కలిగించదు. ఎందుకంటే ఇందులో మెటల్, ఆక్సైడ్‌లను మాత్రమే ఉపయోగిస్తారు. కృత్రిమంగా తయారు చేసిన అణువులను ఉపయోగించే ప్రస్తుత పిగ్మెంట్ ఆధారిత కలర్స్ లాగా కాకుండా, ఈ కొత్త పెయింట్ అనేక రకాలుగా భిన్నంగా ఉంటుంది. సీతాకోక చిలుకలను స్ఫూర్తిగా తీసుకొని ఈ అధునాతన పెయింట్‌ను రూపొందించినట్లు యూసీఎఫ్ (UCF)కు సంబంధించిన నానోసైన్స్ టెక్నాలజీ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేబాషిస్ చందా తెలిపారు. పరిశోధకులు బృందానికి ఇతను నాయకత్వం వహిస్తున్నాడు. ‘సాధారణంగా వర్ణద్రవ్యం ఫోటాన్‌లను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది కాబట్టి, సాధారణ రంగు మసకబారుతుంది. తాజాగా కనుగొన్న పెయింట్ విషయంలో అంతకే పరిమితం కాలేదు. ఒకసారి పెయింట్ చేస్తే శతాబ్దాల పాటు నిలిచి ఉంటుంది” అని దేబాషిస్ అంటున్నాడు. సాధారణ కమర్షియల్ పెయింట్‌తో పోలిస్తే, కొత్తగా రూపొందించిన ఈ పెయింట్ అప్లికేషన్ తర్వాత ఉపరితలం చల్లగా ఉంటుంది. అంతేగాక గణనీయమైన ఎనర్జీ పొదుపునకు దోహదం చేస్తుంది. శీతలీకరణ కోసం తక్కువ విద్యుత్తును ఉపయోగించడంవల్ల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చు. గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
- Tags
- Global Warming