డిప్రెషన్‌ను తగ్గిస్తున్న రన్నింగ్.. మందులకంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్న నిపుణులు

by Prasanna |   ( Updated:2023-10-07 07:04:02.0  )
డిప్రెషన్‌ను తగ్గిస్తున్న రన్నింగ్.. మందులకంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: డిప్రెషన్‌తో పోరాడుతున్న వారికి యాంటీ డిప్రెసెంట్స్ వాడకం కంటే కూడా డైలీ రన్నింగ్ చేయడం చాలా వరకు మేలు చేస్తుందని ఆమ్‌స్టర్‌డామ్‌లోని వ్రిజే యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. రకరకాల ఆందోళనలు తగ్గించడంలో పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని తేలింది. పరుగెత్తడం అనేది ఫిజికల్ ఫిట్‌నెస్‌‌ను పెంచడంతోపాటు నిరాశ, ఆందోళన వంటి భావాలను వేగంగా తగ్గిస్తుందని రీసెర్చర్స్ గుర్తించారు. స్టడీలో భాగంగా వారు 141 మందిని 16 వారాలపాటు అబ్జర్వ్ చేశారు. ఇందులో 45 మంది డిప్రెషన్ పేషెంట్లు కేవలం మెడికేషన్ మాత్రమే వాడేవారు ఉన్నారు. అయితే వీరు డైలీ రన్నింగ్‌‌లో గానీ, ఇతర వ్యాయామాల్లో గానీ పాల్గొనలేదు. అలాగే 96 మంది డిప్రెషన్ బాధితులు ఎటువంటి యాంటీ డిప్రెసెంట్స్ వాడలేదు. కానీ డైలీ రన్నింగ్‌లో పాల్గొన్నారు. తర్వాత ఈ రెండు గ్రూపులకు చెందిన వ్యక్తుల మెంటల్ హెల్త్‌ను పరిశోధకులు ఎనలైజ్ చేయగా, రన్నింగ్ చేస్తున్న వారిలో మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, దీంతోపాటు బరువు, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, హార్ట్ ఫంక్షన్‌లో పాజిటివ్ మార్పులు వచ్చాయని కనుగొన్నారు. ఇక ఓన్లీ మందులు మాత్రమే వాడుతూ రన్నింగ్‌ లేదా ఇతర వ్యాయామాల్లో పాల్గొనని 45 మందిలో డిప్రెషన్ లక్షణాలు తగ్గకపోగా, ఫిజికల్ ఫిట్‌నెస్ సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. అందుకే డైలీ రన్నింగ్ చేయడంవల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌కు చాలా మంచిదని చెప్తున్నారు.

Advertisement

Next Story