- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలిక.. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ
దిశ, ఫీచర్స్ : పంజాబ్‌లోని రోపర్‌కు చెందిన ఏడేళ్ల బాలిక ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బేస్ క్యాంప్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. మొహాలీలోని యదవీంద్ర పబ్లిక్ స్కూల్‌లో సెకండ్ క్లాస్ చదువుతున్న సాన్వి సూద్ .. ఈ నెల 9న తన తండ్రి దీపక్ సూద్‌తో కలిసి శిఖరాగ్రానికి చేరుకుని ఈ ఘనత సాధించింది.
ఈ అనుభవాన్ని పంచుకున్న సాన్వి.. 'నిజానికి ఇది చాలా కష్టమైన పనే కానీ బేస్ క్యాంప్ చేరుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాను. ఇక ఏదో ఒక రోజు ఎవరెస్ట్‌ను అధిరోహిస్తాను' అని తెలిపింది. కాగా 'ఎవరెస్ట్' సినిమా చూసిన తర్వాతే సాన్వికి బేస్ క్యాంప్‌ను స్కేల్ చేసేందుకు ప్రేరణ పొందిందని ఆమె తండ్రి వెల్లడించారు. ఈ మేరకు కఠిన, శీతల ప్రాంతాల్లో నావిగేట్ చేస్తూ 9 రోజుల్లో దాదాపు 65 కి.మీ. మార్గాన్ని పూర్తిచేసింది సాన్వి. అయితే తనకు ఏడేళ్లే కావడంతో బేస్ క్యాంప్ దాటి వెళ్లేందుకు అనుమతించలేదు. ఇక ఈ ఫీట్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన YPS మొహాలి డైరెక్టర్-ప్రిన్సిపాల్ TPS వారైచ్.. సాన్విని పర్వతారోహణ, సైక్లింగ్, స్కేటింగ్ పట్ల మక్కువ గల అసాధారణ విద్యార్థినిగా అభివర్ణించారు.
ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ముంబైకి చెందిన 10 ఏళ్ల స్కేటర్ రిథమ్ మమానియా కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి అతి పిన్న వయస్కురాలైన భారతీయ పర్వతారోహకుల్లో ఒకరిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో ఆమె 11 రోజుల్లో ట్రెక్ పూర్తి చేయగా.. తల్లిదండ్రులు హర్షల్, ఉర్మి కూడా ట్రెక్‌లో తనతో పాటు ఉన్నారు.