- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమిపైన 'మార్షియన్ హౌజ్'.. ఈ నెలాఖరు నుంచి సందర్శకులకు ఎంట్రీ!
దిశ, ఫీచర్స్ : అనేక సంవత్సరాలుగా అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, రాబోయే కొన్నేళ్లలో మానవులు అక్కడ నివసించే అవకాశముంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే మానవులకంటే ముందే ఆస్ట్రోనాట్స్ వెళతారు కాబట్టి, దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలార్ బేస్ స్పెషలిస్ట్ హ్యూ బ్రౌటన్ ఆర్కిటెక్ట్స్ మార్స్ ప్రొటోటైప్ ఆవాసాన్ని 'మార్షియన్ హౌజ్' పేరుతో భూమిపై నిర్మించింది. అక్కడి పరిస్థితులను ప్రతిబింబించే ఈ నివాసాన్ని ఆగస్టు 31 నుంచి ప్రజల సందర్శనార్థం ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విశేషాలు మీకోసం.
భవిష్యత్తులో మార్స్ ఆవాసాలు ఏ రూపంలో ఉండవచ్చనే ఆలోచనతో హ్యూ బ్రౌటన్ ఆర్కిటెక్స్‌కు చెందిన ఇంజనీర్స్ ఎల్లా గుడ్, నిక్కీ కెంట్స్‌లు 2020లో ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో 'మార్షియన్ హౌజ్'ను రూపొందించారు. వీరితో పాటు ఈ ప్రాజెక్ట్‌లో డిజైనర్లు పియర్స్, ప్రొఫెసర్ లూసీ బెర్తౌడ్, డాక్టర్ రాబర్ట్ మైహిల, బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ నార్మన్ ఇందులో భాగమయ్యారు. కాగా 53 చదరపు మీటర్ల (570 sq ft) విస్తీర్ణంలో ఉన్న మార్షియన్ హౌజ్‌కు అవసరమైన విద్యుత్.. సోలార్ ప్యానెల్స్ ద్వారా పొందుతుండగా, అంగారక గ్రహంలో ఎదురయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, గాలి, రేడియేషన్ వంటి పర్యావరణ సవాళ్లను తట్టుకోగలిగేలా దీన్ని నిర్మించారు.
వ్యోమగాములు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఇంటీరియర్‌లో హైడ్రోపోనిక్ లివింగ్ రూమ్ నిర్మించగా, అదే గదిలో మొక్కలు కూడా పెంచుతున్నారు. అదేవిధంగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లతో కూడిన 'ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్ రూమ్'తో పాటు రెండు కాంపాక్ట్ బెడ్‌రూమ్ పాడ్స్, షవర్, మార్షియన్ టాయిలెట్(NASA 'లూనార్ లూ' పోటీ ద్వారా ఎంపిక చేసిన మోడల్) ఉన్నాయి. కాగా ఫర్నిచర్ నుంచి మార్షియన్ క్లాత్స్, టూత్ బ్రష్, వాల్‌పేపర్ వరకు ప్రతీ విషయంలో వాలంటీర్ల ఇన్‌పుట్ ఆధారంగా డిజైనర్ల బృందం వాటిని రూపొందించింది. ఈ మార్షియన్ హౌస్ ప్రోటోటైప్‌ను అధికారికంగా ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రజల కోసం ఓపెన్ చేస్తున్నారు.
'అంగారక గ్రహంపై కన్‌స్ట్రక్షన్ లాజిస్టిక్, పర్యావరణ సవాళ్లకు పరిష్కారంగా అభివృద్ధి చేసిన సూత్రాల ఆధారంగా, అంతరిక్ష శాస్త్రవేత్తల సహాయంతో ఇంటిని అభివృద్ధి చేశాం. ప్రజలు.. అంగారక గ్రహంపై ఉండే ఇంటిని వీలైనంత సౌకర్యవంతంగా, స్వాగతించేలా చేసేందుకు వారి సొంత ఆలోచనలను సూచించేందుకు కాన్వాస్‌లా మా ప్రోటోటైప్ ఉపయోగపడుతుంది' అని హ్యూ బ్రౌటన్ డైరెక్టర్ పేర్కొన్నాడు. అయితే ఈ సంస్థనే కాకుండా BIG, ఫోస్టర్ + వంటి హై వంటి సంస్థలు కూడా 3D ప్రింటింగ్ ద్వారా మార్స్‌పై ఇల్లు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.