ఒకేసారి 31వేల మంది మహిళలతో గణనాథుని ప్రార్థనలు

by Nagaya |
ఒకేసారి 31వేల మంది మహిళలతో గణనాథుని ప్రార్థనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మహారాష్ట్ర పూణెలోని ప్రఖ్యాత దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రుషి పంచమిని పురస్కరించుకుని రికార్డు స్థాయిలో ఒకేసారి 31వేల మంది మహిళలు గణపతికి ప్రీతికరమైన అథర్వణ శీర్ష స్తోత్రాన్ని పఠించారు. వినాయక మండపం ఎదుట కూర్చుని గణనాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయ వేషధారణలో ఉన్న మహిళలతో​వినాయక మండపం కళకళలాడింది. అయితే, ఈ ఆనవాయితీ 35 ఏళ్ల నుంచి కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. కరోనా మహామ్మారి కారణంగా గత రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించలేదని, ఈసారి అద్భుతంగా జరిగిందని తెలిపారు.

Advertisement

Next Story