- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లాస్టిక్ బ్యాగ్‌లను సబ్బుగా మార్చేయొచ్చు.. సింపుల్ టెక్నిక్‌తో..
దిశ, ఫీచర్స్: ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్ పొల్యూషన్. యూజ్ అండ్ థ్రో ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్స్, బాటిల్స్ ఉపయోగించడం ద్వారా భూమిపై కాలుష్యం రోజురోజుకు పెరుగుతుంది. అయితే ఇందుకు ప్రధానకారణమైన పాలిథిలిన్‌ను మరింత ఉపయోగకరంగా మార్చగలరని అంటున్నారు శాస్త్రవేత్తలు. సబ్బుగా మార్చడం ద్వారా దానికి న్యూ లైఫ్ ఇచ్చే మెథడ్‌ను కనుగొన్నారు. ప్లాస్టిక్స్ రసాయనికంగా ఫ్యాటీ యాసిడ్స్‌ను పోలి ఉంటాయి. ఇవి సబ్బులోని ప్రధాన పదార్థాలలో ఒకటి. కాగా సోప్ తయారు చేయడానికి ఉపయోగించే కీలక అణువులుగా మార్చవచ్చని చెప్తున్నారు వర్జీనియా టెక్ సైంటిస్టులు.
షాపింగ్ బ్యాగ్స్, బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్‌లో ఉపయోగించే ప్లాస్టిక్స్ అయిన పాలిథిలిన్, పాలీప్రొఫైలిన్‌ను డిటర్జెంట్‌కు ఇంగ్రెడియంట్స్‌గా వినియోగించారు. అయితే పాలిథిలిన్ పొడవాటి కార్బన్ గొలుసులతో తయారు చేయబడింది. సబ్బులు, డిటర్జెంట్లలో ఒక పదార్థమైన సర్ఫ్యాక్టెంట్‌లను తయారు చేయడానికి ఉపయోగించే ఫ్యాటీ యాసిడ్స్‌కు సమానమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంతో పాలిథిలిన్ చెయిన్‌ను చిన్న భాగాలుగా విభజించి.. ఆపై ఆ గొలుసు చివర యాసిడ్ గ్రూప్స్‌ను జోడించడం ద్వారా.. ఫ్యాటీ యాసిడ్‌ను తయారుచేయొచ్చని తెలిపారు పరిశోధకులు. దిగువన వేడిగా, పైభాగంలో చల్లగా ఉండే ఓవెన్‌ని ఉపయోగించడం ద్వారా.. పాలిథిలిన్‌ను గ్యాస్‌గా మార్చకుండా చిన్న ముక్కలుగా విడగొట్టడానికి ప్రయత్నించారు. ఫలితంగా వ్యాక్స్ మాదిరిగా ఉండే షార్ట్-చైన్ పాలిథిలిన్ ప్రొడక్ట్ ఏర్పడింది. ఈ చిన్న మైనపు గొలుసుల చివర ఆక్సిజన్ అణువులను జోడించి.. వాటిని కొవ్వు ఆమ్లాలుగా మార్చారు. ఈ ఫ్యాటీ యాసిడ్స్‌ను సబ్బుగా మార్చేందుకు సపోనిఫికేషన్ అని పిలువబడే రసాయన ప్రతిచర్యను వినియోగించారు.
Read More: స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోరుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి