Alcohol :తండ్రి తాగి తూలితే.. కొడుకుకు 40ఏళ్లకే వృద్ధాప్యం..

by Sujitha Rachapalli |
Alcohol :తండ్రి తాగి తూలితే.. కొడుకుకు 40ఏళ్లకే వృద్ధాప్యం..
X

దిశ, ఫీచర్స్ : ఆల్కహాల్ అలవాటు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందస్తు వృద్ధాప్యాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నారని తెలిపింది తాజా అధ్యయనం. అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, కీళ్లనొప్పులు, చిత్తవైకల్యంతో సహా ముందస్తు వృద్ధాప్య లక్షణాలను వారసత్వంగా పొందుతారు. పేరెంట్స్ నుంచి సంక్రమించిన మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడం వల్ల.. ముఖ్యంగా మగ సంతానంలో ఈ ప్రభావం అధ్వాన్నంగా ఉంటుంది. తల్లిదండ్రులిద్దరికీ మద్యపాన సమస్యలు ఉంటే మరింత దారుణమైన అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు.

కాగా వ్యాయామం చేయడం, విటమిన్ తీసుకోవడం ద్వారా మైటోకాన్డ్రియల్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ ప్రభావాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. టెక్సాస్ A&M స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ (VMBS) పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలను గుర్తించారు.

అయితే తల్లిదండ్రుల మద్యపానం, పిల్లల అభివృద్ధి మధ్య జీవసంబంధమైన లింక్ పై దృష్టి పెట్టిన అధ్యయనం... పిండం ఆల్కహాల్ సిండ్రోమ్( FAS ) అభివృద్ధి చెందుతున్న పిల్లల తల్లిదండ్రులు గర్భధారణకు ముందు మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. లేదంటే బిడ్డ పుట్టిన వెంటనే అనేక డెవెలప్మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story