ఎక్కువసేపు ప్రకృతి ఆస్వాదనతో నిత్య యవ్వనం.. వృద్ధాప్యాన్ని ఎలా అడ్డుకుంటుందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-12-12 06:35:02.0  )
ఎక్కువసేపు ప్రకృతి ఆస్వాదనతో నిత్య యవ్వనం.. వృద్ధాప్యాన్ని ఎలా అడ్డుకుంటుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: ప్రకృతిని ఆస్వాదించడం, పచ్చటి ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపడం ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. కానీ వృద్ధాప్య లక్షణాలను అడ్డుకోవడంలోను, యవ్వనంగా కనిపించడంలోను నేచర్ కీ రోల్ పోషిస్తుందని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. గ్రీన్‌స్పేస్ సెల్యులార్- లెవల్స్ ఇంపాక్ట్స్‌ను తెలుసుకునే ఉద్దేశంతో వారు మొత్తం 7,827 మందిని అబ్జర్వ్ చేశారు. పచ్చని ప్రదేశాలు, పర్యావరణం, బయోలాజికల్ ఏజింగ్ కంట్రోలింగ్‌లో ఎలా దోహద పడతాయో అర్థం చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు.

అందమైన ప్రకృతి, ఆకు పచ్చని ప్రదేశాల్లో ఎక్కువగా గడపడంవల్ల శరీరంలోని టెలోమియర్స్, క్రోమోజోమ్స్ ఎండింగ్‌లో ఉండే ప్రొటెక్టివ్ క్యాప్స్ వృద్ధాప్యం త్వరగా సంభవించకుండా అడ్డకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నిజానికి శరీరంలో వయస్సు పెరుగుతున్న కొద్దీ కణాల విభజనలో (సెల్యులార్ లెవల్స్) మార్పులు వస్తుంటాయి. టెలోమియర్స్ క్రమంగా తగ్గిపోతాయి. దీనివల్ల వృద్ధాప్యం త్వరగా సమీపిస్తుంది. కానీ ప్రకృతి ఆస్వాదన మానసిక, శారీరక ఆరోగ్య శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపడం కారణంగా దీనిని అడ్డుకుంటుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. మెరుగైన మానసిక ఆరోగ్యం మొదలు బలమైన రోగ నిరోధక వ్యవస్థ వరకు ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా స్వచ్ఛమైన గాలి చాలా ముఖ్యం. పచ్చటి ప్రదేశాలు, పర్యావరణం వృద్ధాప్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, మానసిక ఒత్తిడిని, వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ, సోషల్ ఇంటరాక్షన్ వంటి చర్యలను ప్రోత్సహించడంలోనూ పార్కులు, ఆకు పచ్చటి ప్రదేశాలు ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. కాబట్టి అన్ని విధాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed

    null