స్లీప్ అప్నియా దీర్ఘకాలిక కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది.. అధ్యయనంలో వెల్లడి

by Hamsa |   ( Updated:2023-05-13 06:14:47.0  )
స్లీప్ అప్నియా దీర్ఘకాలిక కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్: రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి కారణమయ్యే అబ్ స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియా దీర్ఘకాలిక కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుందని ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా స్త్రీలలో ఈ కోవిడ్ వచ్చే అవకాశం 89 శాతం ఎక్కువగా ఉంటుందని, పురుషుల్లో అయితే 59 శాతం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. యూఎస్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన సీనియర్ రీసెర్చర్ హన్నా మాండెల్ ఆధ్వర్యంలోని వైద్య నిపుణులు బృందం మార్చి 2020 నుంచి 2022 ఫిబ్రవరి వరకు కోవిడ్-19 పాజిటివ్‌గా ఉన్న పేషెంట్లపై స్టడీ కొనసాగించింది.

మొత్తం 3 లక్షల 30 వేల మంది పేషెంట్లను పరిశీలించింది. ఇందులో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు. దీని ప్రకారం పరిశోధకులు అబ్ స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియా(OSA) బాధితుల్లో దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించారు. స్లీప్ అప్నియాతో బాధపడుతున్నవారిలో ప్రారంభ కోవిడ్ సమయంలో ఒకవేళ ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివి ఉంటే మరింత రిస్కు పొంచి ఉంటుందని, దీర్ఘకాలిక కోవిడ్ సమస్య పెరుగుతుందని నిపుణులు కనుగొన్నారు. 2023లో కూడా ఆయా దేశాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోందని చెబుతున్నారు. అందుకే ‘కోవిడ్ బారిన పడిన స్లీప్ అప్నియా బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవడంవల్ల ఇతర దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, డెత్ రిస్కు నుంచి బయట పడవచ్చని అధ్యయన కర్తలు పేర్కొన్నారు.

Also Read...

మీ రెండు కనుబొమ్మలు కలిశాయా.. అయితే ఇలానే జరుగుతుందంట?

Advertisement

Next Story