- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Male Infertility : సంతానలేమికి చెక్.. పురుషుల్లో ఆ సామర్థ్యం పెరగాలంటే..?

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టకపోతే చాలా మంది ఆ లోపం మహిళలదే అనే అపోహ కలిగిన వారు ఇప్పటికీ ఉంటున్నారు. కానీ పురుషుల్లో లోపాలు కూడా సంతాన లేమికి దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, క్వాలిటీ, మొబిలిటీ సక్రమంగా లేకపోయినా స్త్రీ గర్భం ధరించే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతోపాటు మెంటల్ స్ట్రెస్, మద్యపానం, ధూమపానం, అధిక కొవ్వులు కలిగిన ఆహారపు అలవాట్లు కూడా వంధ్యత్వానికి దారితీయవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పోషకాలలోపం అనేకమంది పురుషుల్లో సంతానలేమికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అయితే సంతానలేమికి చెక్ పెట్టడంలో సహాయపడే ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
* విటమిన్ సి : పురుషుల్లో సంతానలేమి సమస్యకు చెక్ పెట్టడంలో విటమిన్ సి కలిగిన ఆహారాలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి స్పెర్మ్ క్వాలిటీని, క్వాంటిటీని పెంచుతాయి. అంతేకాకుండా స్పెర్మ్ మొబిలిటీని మెరుగు రుస్తాయి కాబట్టి వంధ్యత్వంతో బాధపడేవారు తమ డైట్‌లో భాగంగా క్యాప్సికమ్, స్ట్రాబెర్రీ, బొప్పాయి, నిమ్మ, జామ, దానిమ్మ, కివి, ఉసిరి.. వంటి ఆహారాలను చేర్చుకోవాలి. వీటితోపాటు సి విటమిన్ కలిగిన అన్ని కూరగాయలు, పండ్లు తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*విటమిన్ 12, జింక్ : పురుషుల్లో వీర్యం ఉత్పత్తి కావడానికి విటమిన్ బి 12 కీలకపాత్ర పోషిస్తుంది. ఇది పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాసం, మొక్క ఆధారిత ఆహారాల ద్వారా లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక జింక్ అనేది పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి ముఖ్యమైన పోషకం. ఇది సంతానోత్పత్తిని, కండరాల ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తుంది. మష్రూమ్స్, గుమ్మడికాయ, పాలకూర, గోంగూర, మసూరీ దాల్, పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడంవల్ల శరీరానికి తగిన జింక్ లభిస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను పెంచడం ద్వారా పురుషుల్లో సంతానలేమి సమస్యలను నివారిస్తుంది. అందుకే విటమిన్ బి12, జింక్ కలిగిన అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
*విటమిన్ డి, ఇ, ఫోలేట్ : పురుషుల్లో విటమిన్ డి లోపం ఎక్కువైతే కూడా వంధ్యత్వానికి దారితీయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ను, స్పెర్మ్ క్వాలిటీని పెంచడానికి సహాయపడుతుంది. అప్పుడప్పుడూ ఉదయంపూట శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవడం, ఆహారంలో భాగంగా సాల్మన్ ఫిష్, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అట్లనే విటమిన్ ఇ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పురుషుల్లో స్పెర్మ్ డ్యామేజ్‌ని నివారించి నాణ్యత పెంచడంలో సహాయపడుతుంది. పొద్దు తిరుగుడు గింజలు, బాదం, బ్రోకలీ, బచ్చలి కూర, గోంగూర, గంగవాయిల్ కూర, పొనగంటికూర వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల ఇతర పోషకాలతోపాటు విటమిన్ ఇ లభిస్తుంది. వీర్య కణాల సంఖ్య పెరగడంలో ఫోలేట్ కూడా ముఖ్యం. కాబట్టి అవకాడో, నారింజ, బీన్స్, ద్రాక్ష, వేరుశెనగ, మొక్కజొన్న, సోయాబీన్, డ్రై ఫ్రూట్స్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీంతోపాటు సెలీనియం కంటెంట్ కలిగిన సీ ఫుడ్స్, బీన్స్, పనీర్, అవిసె గింజలు, తృణ ధాన్యాలు కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను, క్వాలిటీన పెంచడం ద్వారా సంతానలేమి సమస్యలను దూరం చేస్తాయి.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.