వరల్డ్స్ ఫస్ట్ ఫుడ్ ‌మెటావర్స్ 'వన్‌రేర్' ప్రారంభం!

by Manoj |
వరల్డ్స్ ఫస్ట్ ఫుడ్ ‌మెటావర్స్ వన్‌రేర్ ప్రారంభం!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని మొట్టమొదటి ఫుడ్ మెటావర్స్‌ డెస్టినేషన్‌గా గేమింగ్ ప్లాట్‌ఫామ్ 'వన్‌ రేర్ '(OneRare) నిలిచింది. ప్రపంచ ఆహార పరిశ్రమను గేమిఫైడ్ పద్ధతిలోకి తీసుకొస్తూ, ఎన్‌ఎఫ్‌టీలను డిజిటల్‌గా సేకరించేందుకు, వాటిని వాస్తవ ప్రపంచంలో మీల్స్, రెస్టారెంట్ డీల్స్ కోసం ఎక్స్‌చేంజ్ చేసుకునేందుకు యూజర్స్‌ను అనుమతిస్తుంది.

ఫుడ్ అండ్ గేమింగ్ లవర్స్ సుప్రీత్ రాజు, గౌరవ్ గుప్తాలు 'వన్ ‌రేర్'ను ప్రారంభించారు. ఎన్‌ఎఫ్‌టీలను ఆయా రెస్టారెంట్స్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకునేందుకు ఈ కంపెనీ సెలబ్రిటీ చెఫ్స్, ఐకానిక్ రెస్టారెంట్స్, ప్రముఖ వంట షోలు, ఫుడ్ బ్రాండ్‌లతో టైఅప్ అయింది. పాపులర్ చెఫ్స్ సరన్ష్ గోయిలా, జోరావర్ కల్రా సహా మిచెలిన్ స్టార్ చెఫ్ ఆంథోనీ సర్పాంగ్, మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియా పోటీదారు రెనాల్డ్ పోర్నోమోతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర చెఫ్‌లతో కూడా జతకట్టింది. ఆహారం పట్ల తమకున్న ప్రేమ తమను ఈ తరహా కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసేలా చేసిందని 'వన్ రేర్' ఫౌండర్స్ సుప్రీత్ రాజు, గౌరవ్ గుప్తాలు తెలిపారు.

OneRare బీటా టెస్ట్‌ రన్ జరుగుతోంది. ఇందులో గేమింగ్ జోన్ - ఫార్మ్, ఫార్మర్స్ మార్కెట్, కిచెన్ వంటి జోన్స్ ఉన్నాయి. ఈ మేరకు గేమర్స్ వ్యవసాయంలో వాటాను కలిగి ఉండడాన్ని ఎంచుకోవచ్చు లేదా మార్కెట్‌లో వ్యాపారం చేయవచ్చు, వంటగదిలో వంటలను తయారు చేయవచ్చు. ఎవరైనా ఎటువంటి రుసుము లేకుండా OneRare Foodverseలోకి ప్రవేశించవచ్చు, చెక్ చేయొచ్చు.

ఇది ఎలా పని చేస్తుంది?

'ఒక వంటకం చేయడానికి, వినియోగదారులు తప్పనిసరిగా మా వంటగదికి వెళ్లి ఒక రెసిపీని అనుసరించాలి. ఉదాహరణకు మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. ఈ రెసిపీ కోసం మీకు వంట నూనె, బంగాళాదుంప, ఉప్పు అవసరం. వీటితో ఫ్రెంచ్ ఫ్రైస్‌ చేశాక, గేమ్ మెకానిజం ప్రకారం మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ NFT మంజూరవుతుంది. దీన్ని మా ప్లే గ్రౌండ్‌లోని వివిధ గేమ్‌లలో పోరాడేందుకు ఈ ఫ్రెంచ్‌ ఫ్రైస్ NFTని ఉపయోగించవచ్చు. అంతేకాదు మీరు మీ డిష్ NFTలను నిజ జీవిత రెస్టారెంట్లలో కూడా ఉపయోగించగలరు. వాటిని మీల్స్ సహా ఇతర డీల్స్ కోసం స్వైప్ చేయొచ్చు' అని సుప్రీత్ తెలిపాడు.

Advertisement

Next Story