మనకే కాదు.. ఆదివారం వాటిక్కూడా సెలవేనట.. 100 ఏళ్లుగా అదే తంతు!

by Anjali |   ( Updated:2023-04-02 09:27:35.0  )
మనకే కాదు.. ఆదివారం వాటిక్కూడా సెలవేనట.. 100 ఏళ్లుగా అదే తంతు!
X

దిశ, వెబ్‌డెస్క్: కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా సరే పాఠశాలలకు, కళాశాలలకు, కార్యాలయాలకు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఆదివారాలు సెలవు ఉంటుంది. వారానికో సెలవు ప్రకటించడం వల్ల ప్రజలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం వల్ల పని చేయడంలో చురుగ్గా ఉంటారని సంస్థలు భావిస్తున్నారు. అయితే ఇలా మనుషులకు సెలవు ఉండటం వినే ఉంటాము, కానీ జంతువులకు ఆదివారం సెలవు ఉండటం విన్నారా. కానీ ఓ దేశంలో పశు, పక్షులకు కూడా ఆదివారం సెలవు ఉందట. ఇంతకీ ఏ దేశమో తెలుసుకుందామా...

మనుషులకే కాదు జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వడం జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలో మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా విశ్రాంతి అవసరమని స్థానికులు నమ్మకం. అందుకని పశువులకు కూడా ఆదివారం సెలవు ఇస్తారు. ఆ రోజు పశువులకు మేత మాత్రమే ఇస్తారు. ఎటువంటి పనులు చేయించరట. ఈ సంప్రదాయాన్ని ఆ జిల్లాలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు గత 100 ఏళ్లకు పైగా సాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. హర్ఖా, మోంగర్, పరార్, లాల్‌గాడి ఇలా.. ఇతర గ్రామాల ప్రజలు తమ పశువులతో ఆదివారం పని చేయించరు. ఆ రోజు పూర్తిగా పశువులకు కావాల్సిన మేత, పచ్చ గడ్డిని ఇస్తారు. అసలు ఈ సెలవు దినం ఎందుకు ప్రకటించారని సందేహం వచ్చే ఉంటుంది కదా.. ఎందుకంటే... నిజానికి.. వందేళ్ల క్రితం ఓ ఎద్దు పొలంలో దున్నుతున్న సమయంలో కింద పడి చనిపోయిందట. అప్పుడు ప్రజలు ఎద్దు ఎక్కువ పని చేయడం వల్లనే అలసిపోయిందని, దీని కారణంగానే ఎద్దు చనిపోయిందని భావించి, దీంతో గ్రామస్తులందరూ కలిసి వారంలో ఒక రోజు పశువులకు విశ్రాంతి కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికి ఆ రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగడం విశషం.

Also Read..

Thati Bellam: తాటి బెల్లం వల్ల ఉపయోగాలేంటో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed