- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Period Cramps : ఆ సమయంలో కడుపు నొప్పి.. ఇలా చేస్తే తక్షణ ఉపశమనం!
దిశ, ఫీచర్స్ : శారీరక అలసట, అసౌకర్యం, ఆందోళన చిన్న విషయానికే కోపం రావడం వంటి లక్షణాలు అమ్మాయిల్లో సాధారణంగా పీరియడ్స్ వచ్చే సమయంలో కనబడుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు అధిక రక్తస్రావం, శారీరక బలహీనత, తీవ్రమైన కడుపునొప్పి కూడా వేధిస్తుంటాయి. ఇదంతా సహజమైన ప్రక్రియే అయినప్పటికీ ఆ సమయంలో ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.
* నెలసరి సమయంలో కడుపునొప్పి వేధిస్తుంటే.. తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిప్స్, పిజ్జా, బర్గర్ వంటి తినకూడదు. అలాగే ఉప్పు, తీపి, కారం అధికంగా ఉండే ఫుడ్స్, ఇతర వంటకాలు, ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వీటిని తినడంవల్ల శరీరం అసౌకర్యానికి గురవుతుందని, కడుపు నొప్పి మరింత పెరిగే చాన్ష్ ఉటుందని నిపుణులు చెప్తున్నారు.
* పీరియడ్స్ కారణంగా కొందరు అమ్మాయిలు ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా ఆపేస్తుంటారు. అయితే తేలికపాటి వ్యాయామాలు లేదా వాకింగ్ లాంటివి చేయడం మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా వీటివల్ల రుతు క్రమానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి కాస్త రిలీఫ్ పొందుతారని చెప్తున్నారు. అలాగే ఎక్కువసేపు ఏమీ తినకుండా కూడా ఉండకూడదు. శక్తి అవసరం కాబట్టి పోషకాహారం తినాలి. అయితే చక్కెర, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌కు మాత్రం దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.
* రుతుక్రమంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో మానసిక ఆందోళన, చికాకు వంటి లక్షణాలు కనిపించడం సహజమే. అలాంటప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అలాగే రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కోవడం మానుకోవాలి. ఎందుకంటే నిద్రలేమి శారీరక అసౌకర్యాన్ని మరింత పెంచుతుంది.
*టీ, కాఫీ వంటి కెఫిన్ రిలేటెడ్ డ్రింక్స్‌ను పీరియడ్స్ సమయంలో తప్పక నివారించాలి. ఎందుకంటే వీటివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా తలనొప్పి, కళ్లు లాగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడంవల్ల ఆ సమయంలో కడుపులో ఉబ్బరం, మలబద్దకం, హార్ట్ బర్న్ వంటి సమస్యలు పెరగవచ్చు. కాబట్టి దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.