- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Micro Plastic వర్షం.. భయానక నిజాలు వెల్లడించిన తాజా అధ్యయనం
దిశ, ఫీచర్స్: ఇటీవల జరిగిన అధ్యయనాలు ఆహారం, మహాసముద్రాలు, త్రాగునీరు, మానవ శరీరం, రక్తం, ఊపిరితిత్తులతో సహా దాదాపు ప్రతిచోటా మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌లో నిర్వహించిన సరికొత్త అధ్యయనం 'మైక్రోప్లాస్టిక్ వర్షం' కురుస్తున్నట్లు కనుగొంది. వాసన-రుచి లేని, కంటికి కనిపించని ఈ ప్లాస్టిక్ పొగమంచు ప్రతిరోజూ కురుస్తుందని..అనుకున్నదానికంటే ఎక్కువ హానికరం కావచ్చని తెలిపారు శాస్త్రవేత్తలు.
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీలో ప్రచురించబడిన అధ్యయనం..న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంపై 74 మెట్రిక్ టన్నుల మైక్రోప్లాస్టిక్‌ల వర్షం కురిసినట్లు కనుగొంది. ఇది కనీసం మూడు మిలియన్ ప్లాస్టిక్ బాటిళ్లకు సమానం. కాగా నగరం పైకప్పులోని ప్రతి చదరపు మీటరుపై సగటున దాదాపు 5000 మైక్రోప్లాస్టిక్ కణాలు ప్రతిరోజూ స్థిరపడతాయని కూడా అధ్యయనం గుర్తించింది. కనీసం ఎనిమిది రకాల గాలిలో ప్లాస్టిక్ సంచులు లేదా సీసాలలో ఉపయోగించే పాలిథిలిన్ (PE)తో కూడిన ప్లాస్టిక్‌లను కనుగొంది. గాలులు వీచే రోజుల్లో కాంట్రాప్షన్‌లో కనిపించే మైక్రోప్లాస్టిక్స్ సంఖ్య ఇతర రోజులతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. దాదాపు తొమ్మిది వారాలపాటు నిర్వహించబడిన ఈ రీసెర్చ్.. 'అలల నుంచి గాలిలో మైక్రోప్లాస్టిక్స్ ఉత్పత్తి..మైక్రోప్లాస్టిక్స్ ప్రపంచ రవాణాలో కీలక భాగం కావచ్చు' వివరించింది.
అదృశ్య ముప్పు
మైక్రోప్లాస్టిక్ అంటే భూ వాతావరణంలో చిక్కుకునే ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పొడవున్న ప్లాస్టిక్ ముక్కలు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో..అంటార్కిటికా లాంటి మారుమూల ప్రాంతాల్లోని హిమపాతంలో కూడా మైక్రోప్లాస్టిక్‌లు కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోప్లాస్టిక్ ఉందనే భయంకరమైన భయాలను, మునుపటి అధ్యయనాలను ధృవీకరించారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ వర్షాన్ని 'న్యూ యాసిడ్ రెయిన్'గా అభివర్ణిస్తున్న శాస్త్రవేత్తలు..సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువుల ఉద్గారాల కారణంగా ఇప్పటికే పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. కానీ ఆమ్లీకరణ వలె కాకుండా, వర్షం కురిసిన ప్లాస్టిక్‌ను వదిలించుకోవడం దాదాపు అసాధ్యమంటున్న సైంటిస్టులు..'వ్యర్థజలాల ద్వారా మహాసముద్రాలలోకి ప్రవహించిన ప్లాస్టిక్..లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థలను కలుషితం చేస్తుంది. అవి మళ్లీ సముద్రపు గాలిలో కలిసి భూమిపైకి వస్తున్నాయి' అని కూడా నివేదికలో పేర్కొన్నారు.
- Tags
- Plastic