రోగాలు వస్తే మెడిసిన్ అవసరం లేదు.. పండ్లు, కూరగాయలతో తగ్గిస్తారట !

by Anjali |   ( Updated:2023-08-30 06:39:44.0  )
రోగాలు వస్తే మెడిసిన్ అవసరం లేదు.. పండ్లు, కూరగాయలతో తగ్గిస్తారట !
X

దిశ, ఫీచర్స్: చాలా వరకు అనారోగ్య సమస్యలన్నీ విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం తదితర పోషకాల లోపం వల్ల తలెత్తుతుంటాయి. డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు వీటిని సరిచేయడానికి మెడిసిన్ రాస్తుంటారు. వాటిని వాడాక ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంటాయి. అయితే ఇక నుంచి వైద్యులు సూచించే మెడిసిన్ లో సరికొత్త మార్పులు రావచ్చు. హెల్త్ ప్రాబ్లమ్‌ను బట్టి వివిధ మందులకు బదులు, ప్రత్యేకించి తీసుకోవాల్సిన తాజా పండ్లు, కూరగాయలను సూచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ‘ఫుడ్ మెడిసిన్’ అనే కొత్త రకం ప్రిస్క్రిప్షన్ కార్డియో వాస్క్యులర్ హెల్త్‌పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపుతుందని ఒక కొత్త పరిశోధనలో వెల్లడైంది.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు యునైటెడ్ స్టేట్స్‌లో గుండె జబ్బులు, టైప్ -2 డయాబెటిస్ రిస్క్ ఎదుర్కొంటున్న 1,817 మంది పిల్లలు, 2,064 మంది పెద్దలపై స్టడీ నిర్వహించారు. పైగా వీరంతా లో ఇన్‌కం కమ్యూనిటీస్‌కు చెందినవారేగాక, ఆహార భద్రతలేనివారు. వీరందరికీ న్యూట్రిషన్ క్లాస్‌ల ద్వారా అవగాహన కల్పిస్తూ సరైన పోషకాహారం అందించారు. ఇలా 4 నుంచి 10 నెలల వరకు కొనసాగిస్తూ మధ్య మధ్యలో వారిలో అనారోగ్యాలు, బీపీ, డయాబెటిస్, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను పరీక్షించారు.

అయితే సగటును ఆరు నెలలపాటు పండ్లు, కూరగాయలు వంటి ‘ఫుడ్ ప్రిస్క్రిప్షన్’ అనుసరించిన వారిలో రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్, రక్తంలో చక్కెర స్థాయిలు భారీగా తగ్గినట్లు, కార్డియో వాస్క్యులర్ హెల్త్‌పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపినట్లు తాము కనుగొన్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం కూడా పేదరికం, పోషకాహారం లోపం కారణంగానే 2019లో వరల్డ్ వైడ్ దాదాపు 8 మిలియన్ల మంది మరణించారు. కాబట్టి భవిష్యత్తులో ‘ఫుడ్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్’పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story