- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్వ్ ఫ్లాసింగ్.. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను తగ్గించే మోడ్రన్ ట్రీట్‌మెంట్
దిశ, ఫీచర్స్: మానవ శరీరం గురించి తెలుసుకోవడానికి వెతకడం ప్రారంభించినప్పుడల్లా ఏదో ఒక కొత్త సమాచారం అందుబాటులోకి వస్తూనే ఉంటుందని పరిశోధకులు చెప్తుంటారు. అలాంటి వాటిలో నర్వ్ ఫ్లాసింగ్ ప్రక్రియ కూడా ఒకటి. చేతుల్లో తిమ్మిరి(numbness), జలదరింపు(tingly) అనుభూతిని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని ఫిజియో థెరపిస్టులు చెప్తున్నారు. సాధారణంగా నర్వ్ గ్లైడింగ్ లేదా నర్వ్ ఫ్లాసింగ్ ఎక్సర్‌సైజ్ అనేది వ్యక్తుల్లో తిమ్మిరి సమస్య సంభవించినప్పుడు రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా లేదా శస్త్రచికిత్స అనంతర కాలంలో ఈ సమస్య తలెత్తకుండా ఉపయోగిస్తుంటారు. ఇది నరాల చలనశీలతను మెరుగుపరచడానికి ఒక చక్కటి మార్గం భావిస్తారు.
సమస్యకు కారణం?
మానవ కండరాల మాదిరిగానే నరాలు కూడా కదులుతాయి. కొన్నిసార్లు అవి తగినంతగా కదలనప్పుడు కంప్రెస్ అవుతాయి. చికాకు కలుగుతుంది. ఈ పరిస్థితి నరాల తిమ్మిరితో కూడిన కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ల ప్రకారం శరీరంలోని అన్ని నాడులు అస్థి, మృదు కణజాల నిర్మాణాలతో చుట్టుముట్టబడి ఉంటాయి. ఇవి ఇరుకైన టన్నెల్స్, కెనాల్స్, ఖాళీల గుండా వెళుతున్నందున సంపీడనం కలుగుతుంది. అలాగే తరచూ కీబోర్డును ఉపయోగించే వారిలో, ఎక్కువగా రాయడం (స్టూడెంట్స్) వంటి పనులు చేయడంవల్ల ఈ సమస్య తలెత్తుంది. విటమిన్ బి 12 లోపం, డయాబెటిక్ న్యూరోపతి, ట్రామాటిక్ నర్వ్ ఇంజ్యూరీస్, కాళ్లు చేతులను వివిధ వ్యాయామాల సందర్భాల్లో అధికంగా సాగదీయడం వంటి కారణాలవల్ల కూడా తిమ్మిరి లేదా టన్నెల్ సిండ్రోమ్ సమస్యకు దారితీస్తుంది.
పరిష్కారం ఏంటి?
శరీరం లేదా కాళ్లు, చేతులు తరచూ తిమ్మిరి పట్టడం లక్షణాలు కలిగిన టన్నెల్ సిండ్రోమ్ వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి దీనిని నయం చేయడానికి ఆర్థోపెడిక్ సర్జన్లు లేదా ఫిజియోథెరపిస్టులు ‘నర్వ్ ఫ్లాసింగ్’ ట్రీట్మెంట్‌ను సజెష్ చేస్తారు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది నరాల సాగతీత చికిత్స. ఒక రకమైన వ్యాయామం. విసుగు చెందిన నరాలను సమీకరించడానికి, ఉత్తేజరకంగా పనిచేయడానికి ఇది దోహదం చేస్తుంది. న్యూరోడైనమిక్స్‌ను మెరుగుపరుస్తుంది. కీళ్ల కదలికలో నాడిని స్వేచ్ఛగా నడపడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యంత ఆధునిక నర్వ్ ట్రీట్మెంట్లలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్, పిరిఫార్మిస్ అండ్ సయాటికా వంటి ఆరోగ్య సమస్యల్లోనూ దీనిని ఉపయోగిస్తారు.
Read More: టీవీ స్క్రీన్ నల్లగా ఎందుకు ఉంటుందో తెలుసా?