Sunday Special: చికెన్, మటన్ కర్రీలో నిమ్మ రసం పిండుకుంటున్నారా..?

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-19 08:44:13.0  )
Sunday Special: చికెన్, మటన్ కర్రీలో నిమ్మ రసం పిండుకుంటున్నారా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అన్ని వారాల్లో కెళ్ల ఆదివారానికి(Sunday) సపరేట్ క్రేజ్ ఉంటుంది. వారం మొత్తం బిజీ లైఫ్‌లో గడిపిన అందరూ సండే రోజు చిల్ అవుతుంటారు. సెలవు దినం కావడంతో ఇంట్లో అంతా ఆనందంగా గడుపుతుంటారు. రోజూ లాగా కాకుండా స్పెషల్‌గా చికెన్(Chicken), మటన్(Mutton) లేదా ఫిష్ వండుకొని లాగించేస్తుంటారు. అయితే కొందరు మాంసం కర్రీలో నిమ్మరసం పిండుకుని తింటుంటారు. అలాంటి వారికి నిపుణులు పలు సూచనలు చేశారు. నిమ్మరసంలో విటమిన్-సీ(Vitamin-C) వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుందని.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. హానికరమైన బ్యాక్టీరియా(Harmful bacteria) ఉంటే నాశనమవుతుందని, నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్లు కర్రీకి రుచి మృదుత్వాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. అయితే.. ఆ నిమ్మరసం మోతాదుకు మించొద్దని కూడా హెచ్చరికలు చేస్తున్నారు. పరిధి దాటితే మళ్లీ కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే తక్కువ మోతాదులో తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.



Next Story